Rahul Gandhi : ఆందోల్ – అవినీతి, అక్రమాలకు తెలంగాణ కేరాఫ్ గా మారి పోయిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఏఐసీసీ మాజీ చీఫ్ , ఎంపీ రాహుల్ గాంధీ . ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆందోల్ లో జరిగిన కాంగ్రెస్ విజయ భేరి సభలో పాల్గొని ప్రసంగించారు.
Rahul Gandhi Shocking Comments on KCR
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు అహంకారానికి, ఆత్మ గౌరవానికి, నీతికి అవినీతికి మధ్య జరుగుతున్న పోరాటమని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ(Rahul Gandhi ). దొర, గడీల పాలనకు చెక్ పెట్టక పోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదన్నారు . ధరణి పోర్టల్ ను కేసీఆర్ గుప్పిట్లో పెట్టుకుని పేదల కు చెందిన విలువైన భూములను కాజేశాడంటూ ఆరోపించారు .
నమ్మించి మోసం చేశాడంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని పదే పదే కేసీఆర్, కేటీఆర్ అడుగుతున్నారని దానికి తన వద్ద సమాధానం ఉందన్నారు. హైదరాబాద్ ను అభివృద్ది చేసింది తమ పార్టీనేనని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కూడా తామేనని ఆ విషయం గుర్తిస్తే మంచిదన్నారు రాహుల్ గాంధీ.
ఇవాళ చదువుకుంటున్న బడులు, కాలేజీలు కట్టించింది కూడా కాంగ్రెస్ పార్టీయేనని పేర్కొన్నారు.
Also Read : Minister KTR : 29న దీక్షా దివస్ – కేటీఆర్