Rahul Gandhi : కాంగ్రెస్ అగ్ర నేత, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణను నిట్ట నిలువునా దోచుకుంటున్న సీఎం కేసీఆర్ తో పొత్తు ఉండదని స్పష్టం చేశారు.
వరంగల్ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు సంఘర్షణ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారీ ఎత్తున జనం వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు కూడా ఝలక్ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ నేతలతో ఎవరైనా కలిసినా లేదా వారితో సత్ సంబంధాలు కొనసాగించినా ఊరుకోబోమంటూ హెచ్చరించారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). రాబోయే ఎన్నికల్లో టీఆర్ ఎస్ ను ఓడించడం ఖాయమన్నారు.
కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందన్నారు. ఈ యుద్ధం ఇరు పార్టీల మధ్య ఉంటుందని బీజేపీ ఊసే లేదన్నారు. అంతే కాకుండా రైతు డిక్లరేషన్ లో చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ.
తెలంగాణ రాష్ట్రం కోసం ఎందరో బలిదానాలు చేయడం వల్ల వచ్చిందన్నారు. కేవలం ఒక్క కేసీఆర్ కుటుంబం ఏర్పడ లేదని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటై ఎనిమిది ఏళ్లవుతున్నా ఉన్న చోటనే ఉందన్నారు.
కొత్త రాష్ట్రం వల్ల ఒక్క కేసీఆర్ ఫ్యామిలీ మాత్రమే బాగుపడిందన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరూ ఒక్కటేనని ఎద్దేవా చేశారు రాహుల్ గాంధీ.
3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న ఇప్పటి వరకు ఎందుకు భర్తీ చేయలేదన్నారు. బంగారు తెలంగాణలో రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు.
Also Read : రాహుల్ గాంధీ పొలిటికల్ టూరిస్ట్