Rahul Gandhi : చెప్పింది చేయ‌క పోవ‌డం మోదీ నైజం

ప్ర‌ధాన మంత్రిపై సంచ‌ల‌న కామెంట్స్

Rahul Gandhi :  కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని టార్గెట్ చేశారు. చెప్పింది చేయ‌క పోవ‌డం మోదీ స్పెషాలిటీ అన్నారు.

బిల్కిస్ బానో దోషుల విడుద‌ల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. బిల్కిస్ బానోపై అత్యాచారం చేసి, ఆమె కుటుంబంలోని ఏడుగురిని చంపిన 11 మందిని విడుద‌ల చేయ‌డం దారుణ‌మ‌న్నారు.

దీని ద్వారా మ‌హిళ‌ల‌కు ఏం సందేశం ఇస్తున్నారంటూ ప్ర‌శ్నించారు రాహుల్ గాంధీ. మీ మాట‌లు తీయగా ఉంటాయి. కానీ చేత‌లు మాత్రం ఇత‌రుల‌ను టార్గెట్ చేస్తాయంటూ ఆరోపించారు.

పంధ్రాగ‌స్టు సంద‌ర్బంగా నారీ శ‌క్తి గురించి ఎంతో గొప్ప‌గా చెప్పారు. మ‌రి ఈ కేసులో దోషుల విడుద‌ల‌పై ఎందుకు మాట్లాడ‌డం లేదంటూ నిల‌దీశారు ప్ర‌ధానిని.

ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ సంద‌ర్భంగా 5 నెల‌ల గ‌ర్భిణీపై అత్యాచారం చేశారు. ఆమె 3 ఏళ్ల కూతురును చంపిన వారిని విడుద‌ల చేశారు.

ఇదేనే జాతీయ వాదం అంటే అని మండిప‌డ్డారు రాహుల్ గాంధీ(Rahul Gandhi) . మ‌హిళా సాధికార‌త గురించి మాట్లాడే వారి నుంచి దేశంలోని మ‌హిళ‌ల‌కు ఏం సందేశం వెళుతోంద‌న్నారు.

మ‌హిళ‌లు, యువ‌తులను ఇబ్బందుల‌కు గురి చేసే ఏ ప‌ని కూడా చేయ కూడ‌ద‌ని చెప్పార‌ని కానీ సీన్ చూస్తే రివ‌ర్స్ గా ఉంద‌న్నారు మ‌రికొంద‌రు కాంగ్రెస్ నాయ‌కులు. దేశంలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోతోంద‌న్నారు.

అస‌లు న్యాయ స్థానం కూడా మౌనంగా ఎందుకు ఉందో ఆలోచించు కోవాల‌ని పేర్కొన్నారు రాహుల్ గాంధీ.

Also Read : ఫిఫా నిషేధంపై కోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

Leave A Reply

Your Email Id will not be published!