Rahul Gandhi : ఎల్ఐసీపై కేంద్రం తీరు బాధాక‌రం

ఆవేద‌న వ్య‌క్తం చేసిన రాహుల్ గాంధీ

Rahul Gandhi : ప్ర‌పంచంలోనే అత్యంత న‌మ్మ‌క‌మైన సంస్థ‌గా రూపుదిద్దుకుంది భార‌తీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ). కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్ర‌భుత్వం గంప గుత్త‌గా ప్ర‌భుత్వానికి చెందిన విలువైన ఆస్తుల‌ను అమ్మ‌కానికి లేదా లీజుకు ఇచ్చే ప‌నిలో ప‌డ్డారు.

దీనిని తీవ్రంగా వ్య‌తిరేకిస్తూ వ‌స్తోంది కాంగ్రెస్ పార్టీ. ప‌దే ప‌దే అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది ఉభ‌య స‌భ‌ల్లో. కానీ మెజారిటీ ఉంద‌న్న అహంకారంతో కేంద్రం సంస్థ‌ల‌న్నింటిని అంగట్లో స‌రుకుల్లాగా ట్రీట్ చేస్తోంది.

ఇదే స‌మ‌యంలో అత్యంత లాభ‌దాయ‌క‌మైన సంస్థ‌గా ప్ర‌పంచ వ్యాప్తంగా పేరొందిన ఎల్ఐసీపై క‌న్నేసింది మోదీ ప్ర‌భుత్వం. ఇందులో ఐపీఓకు పిలుపునిచ్చింది.

విచిత్రం ఏమిటంటే ఎల్ఐసీలో 13.94 ల‌క్ష‌ల మంది ఉపాధి పొందుతున్నార‌ని పేర్కొన్నారు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi). 30 కోట్ల మందికి పైగా పాల‌సీదారులు ఉన్నారు.

దాదాపు 39 ల‌క్ష‌ల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఎల్ఐసీకి. వ‌ర‌ల్డ్ లోనే అత్య‌ధిక వాటాదారులు ఉన్నా ఎందుక‌ని మోదీ ప్ర‌భుత్వం ఎల్ఐసీని త‌క్కువ‌గా అంచ‌నా వేసింద‌ని ప్ర‌శ్నించారు రాహుల్ గాంధీ(Rahul Gandhi).

ఇది ప్ర‌జ‌ల‌ను, దేశాన్ని మోసం చేయ‌డం కాదా అని నిల‌దీశారు. ఈరోజు వ‌ర‌కు ఎందుకు అమ్ముతున్నారో చెప్ప‌డం లేదు. ఎవ‌రికి క‌ట్ట బెడుతున్నారో వివ‌రించడం లేదు.

జాతీయ వాదం, హిందూత్వ పేరుతో రాజ‌కీయం చేస్తూ జ‌నాన్ని బురిడీ కొట్టిస్తున్న మోదీకి రాబోయే రోజుల్లో జ‌న‌మే స‌రైన స‌మాధానం చెబుతార‌ని హెచ్చ‌రించారు.

ఎవ‌రైనా న‌ష్టాల్లో ఉన్న వాటిని విక్ర‌యానికి పెడ‌తారు. కానీ మోదీ మాత్రం లాభాల్లో ఉన్న వాటిని అమ్ముతున్నారు. ఇందు కోస‌మేనా మిమ్మ‌ల్ని ఎన్నుకున్న‌ద‌ని మండిప‌డ్డారు రాహుల్ గాంధీ.

Also Read : కాంగ్రెస్ పార్టీలో కీల‌క‌ మార్పులు

Leave A Reply

Your Email Id will not be published!