Rahul Gandhi : ఆయుష్మాన్ ప‌థ‌కం రోగుల పాలిట శాపం

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

Rahul Gandhi  : కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత , వాయునాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi )సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న మ‌రోసారి మోదీ స‌ర్కార్ ను టార్గెట్ చేశారు. ఇవాళ ట్విట్ట‌ర్ వేదిక‌గా మోదీ తీసుకు వ‌చ్చిన ఆయుష్మాన్ ప‌థ‌కంపై క‌ల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

ఆ ప‌థ‌కం వ‌ల్ల దేశానికి ఒరిగింది ఏమీ లేద‌న్నారు. దానిని బ‌క్వాస్ అంటూ కొట్టి పారేశారు. క‌రోనా క‌ష్ట కాలంలో ల‌క్ష‌లాది మంది జ‌నం తీవ్ర ఇబ్బందులు ప‌డ్డార‌ని కానీ సాయం మాత్రం అంద‌లేద‌ని ఆరోపించారు.

ప్ర‌చారంం మాత్రం గొప్ప‌గా చేశార‌ని కానీ ఆచ‌ర‌ణ‌లోకి వ‌చ్చే స‌రిక‌ల్లా ఎవ‌రికీ చెంద‌లేని మండిప‌డ్డారు. ఆయుష్మాన్ ప‌థ‌కం వ‌ల్ల క‌రోనా బారిన ప‌డిన బాధితుల‌కు, రోగుల‌కు ఎలాంటి సాయం అంద‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు రాహుల్ గాంధీ(Rahul Gandhi ).

రోగుల ప‌ట్ల‌, ప్ర‌జ‌ల ప‌ట్ల దారుణంగా ప్ర‌వ‌ర్తించిందంటూ సీరియ‌స్ అయ్యారు. మోదీకి వ్య‌క్తిగ‌త ప్ర‌చారం, కులం, మ‌తం, ఆల‌యాలు, ఓట్లు, సీట్లు త‌ప్ప మ‌రొక దాని గురించి ప‌ట్టించు కోరంటూ ఎద్దేవా చేశారు.

కోవిడ్ క‌ష్ట కాలంలో త‌మ జీవితాల‌ను ప‌ణంగా పెట్టి ప‌ని చేసిన వారియ‌ర్స్ , వ‌ర్క‌ర్ల‌ను ఈరోజు వ‌ర‌కు ప‌ట్టించుకున్న దాఖ‌లాలు లేవ‌న్నారు. బాధితుల‌కు ఉచిత వైద్యం అంద‌లేద‌ని ఆరోపించారు రాహుల్ గాంధీ.

అంతే కాకుండా కేంద్ర స‌ర్కార్ తీరు కార‌ణంగా దేశంలోని చిన్న‌, సూక్ష్మ త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు మూత ప‌డ్డాయ‌ని వాటిని ఆదుకునే నాథుడే లేకుండా పోయాడంటూ ఎద్దేవా చేశారు.

Also Read : 26న కాంగ్రెస్ పార్టీ కీల‌క భేటీ

Leave A Reply

Your Email Id will not be published!