Rahul Gandhi : యాత్రను అడ్డుకునేందుకు ఓ ఎత్తుగడ
కేంద్రంపై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
Rahul Gandhi : కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి కావాల్సింది ద్వేషం కాదు ప్రేమ కావాలనే నినాదంతో గత 100 రోజులుగా భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టారు. అన్ని వర్గాల నుంచి ఆదరణ పొందుతోంది. ప్రధానంగా రాహుల్ గాంధీ ఇవాళ దేశంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు.
ఆయన కేంద్రాన్ని నిలదీస్తున్నారు. ప్రశ్నిస్తున్నారు. సవాలక్ష సమస్యలను ఏకరువు పెడుతున్నారు. కులం, ప్రాంతం, మతం అన్నది లేకుండా అందరితో కలుస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన పలు రాష్ట్రాలలో యాత్రను చేపట్టారు. ఈ ఏడాది సెప్టెంబర్ 6న తమిళనాడు లోని కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్రను ప్రారంభించారు.
ఇది 150 రోజుల పాటు కొనసాగుతోంది. ఇప్పటి వరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాలలో యాత్ర పూర్తి చేసుకుంది. ఇప్పటికే వంద రోజులు పూర్తి చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ నెలకొంది. ఇదిలా ఉండగా యాత్రకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక ప్రకటన చేశారు.
ఈ మేరకు రాహుల్ గాంధీకి, రాజస్థాన్ సీఎంకు లేఖలు రాశారు. ప్రతి ఒక్కరు కోవిడ్ రూల్స్ పాటించాలని లేక పోతే యాత్రను నిలిపి వేసేందుకు ప్రయత్నం చేయాలంటూ సూచించారు. దీనిపై నిప్పులు చెరిగారు రాహుల్ గాంధీ(Rahul Gandhi) . యాత్రను అడ్డుకునేందుకు బీజేపీ ఆడుతున్న నాటకంలో ఓ భాగమని ఆరోపించారు.
Also Read : కరోనా గురించి చెప్పడం నా బాధ్యత