Rahul Gandhi : వేటు వేసినా ప్ర‌శ్నిస్తూనే ఉంటా

ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ

Rahul Gandhi : ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప్ర‌స్తుతం అమెరికా టూర్ లో ఉన్నారు. ఆరు రోజుల పాటు ప‌ర్య‌టిస్తారు. ఈ సంద‌ర్బంగా యుఎస్ లోని ప్రముఖ విశ్వ విద్యాల‌యం స్టాన్ ఫోర్డ్ యూనివ‌ర్శిటీలో రాహుల్ గాంధీ(Rahul Gandhi) ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు. ప్రేక్ష‌కులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు.

తాను రాజ‌కీయాల్లోకి కేవ‌లం ప‌ద‌వుల కోసం రాలేద‌న్నారు. ప్ర‌జ‌ల త‌రపున వారి గొంతును వినిపించేందుకు వ‌చ్చాన‌ని చెప్పారు. అయితే తాను పార్ల‌మెంట్ స‌భ్యుడిగా ఎన్నో ప్ర‌శ్న‌ల్ని సంధించాన‌ని స్ప‌ష్టం చేశారు. త‌న‌పై ఎంపీగా అన‌ర్హుడిగా వేటు వేసినా తన ధిక్కార స్వ‌రాన్ని వినిపించ‌డంలో ఎక్క‌డా త‌గ్గ‌లేద‌ని రాహుల్ గాంధీ చెప్పారు.

ఈ నిర్ణ‌యం వ‌ల్ల తాను బాధ ప‌డ‌లేద‌న్నారు. ఎందుకంటే మ‌రింత‌గా ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యే అవ‌కాశం త‌న‌కు ల‌భించింద‌న్నారు. రాజ‌కీయం అంటే ఎదుటి వాళ్ల‌ను విమ‌ర్శించ‌డ‌మ‌ని తాను అనుకోవ‌డం లేద‌న్నారు. తాను వ్య‌క్తిగ‌తంగా ఎవ‌రినీ వ్యాఖ్యానించ లేద‌న్నారు. కేవ‌లం దేశం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను, వ‌న‌రుల విధ్వంసం గురించి ప్ర‌శ్నించాన‌ని చెప్పారు.

కానీ ఎక్క‌డా త‌ల వంచ లేద‌న్నారు. ఈ దేశం కోసం త‌మ ఫ్యామిలీ ప్రాణాలు పోగొట్టుకుంద‌ని మ‌రి జాతీయ వాదం పేరుతో దేశాన్ని అల్ల‌క‌ల్లోలం చేస్తున్న బీజేపీ, దాని అనుబంధ సంస్థ‌లు ఎలాంటి త్యాగాలు చేశాయో దేశ ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌న్నారు.

Also Read : AP Govt Hike Land Rates

 

Leave A Reply

Your Email Id will not be published!