Rahul Gandhi : మోదీ పాలనలో మహిళల రక్షణకు దిక్కేది
ఇంకెంత మందిని పొట్టన పెట్టుకుంటారు
Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. మోదీ పాలనలో మహిళలు, బాలికలు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న 19 ఏళ్ల యువతి అత్యాచారం, హత్యకు దారి తీసిన ఘటనపై స్పందించారు రాహుల్ గాంధీ(Rahul Gandhi) .
యువతి దారుణ హత్య దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఇందులో భారతీయ జనతా పార్టీకి చెందిన మాజీ మంత్రి తనయుడి పాత్ర ఉందని తేటతెల్లమైంది. అంతే కాకుండా తనకు చూపించకుండానే తన కూతురిని దహనం చేశారంటూ ఆరోపించింది మృతురాలి తల్లి.
ఒక్క ఉత్తరాఖండ్ ఘటననే కాదని దేశ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలో ఎక్కడో ఒక చోట చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. ఆడపిల్లను రక్షించండి అని నినాదం చేస్తున్న నరేంద్ర మోదీ అదే బాలికలు, యువతులు, మహిళలపై దారుణాలు జరుగుతున్నా ఇప్పటి వరకు నోరు మెదపడం లేదని మండిపడ్డారు.
ఈ సందర్భంగా అంకితా భండారీకి నివాళులు అర్పించారు రాహుల్ గాంధీ(Rahul Gandhi) . తమ పార్టీకి చెందిన నాయకుడి తనయుడి పాత్ర ఉందని తేలినా ఎందుకని మౌనంగా ఉన్నారో దేశానికి చెప్పాల్సిన బాధ్యత ప్రధానమంత్రిపై ఉందన్నారు.
మహిళలను వస్తువులుగా, రెండో తరగతి పౌరులుగా ఎలా పరిగణిస్తున్నారో ఈ ఘటన ఒక్కటి చాలు అని ధ్వజమెత్తారు. ప్రధానంగా బీజేపీ దాని అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ ఎందుకు నోరు ఎత్తడం లేదని సూటిగా ప్రశ్నించారు రాహుల్ గాంధీ.
Also Read : దేశ ప్రజల చిరకాల డిమాండ్ తీరింది – సీఎం