Rahul Gandhi : ఆసామీలకు దోచి పెడుతున్న మోదీ – రాహుల్
చైనా సైన్యాన్ని ఎదుర్కోవడంలో భారత్ విఫలం
Rahul Gandhi : కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. దేశాన్ని అమ్మకానికి పెట్టిన ఘనత ప్రధానమంత్రి మోదీకి దక్కుతుందని ధ్వజమెత్తారు. ఓ వైపు చైనా సైన్యం దూసుకు వస్తుంటే బాధ్యత కలిగిన పీఎం నిద్ర పోతున్నారంటూ ఆరోపించారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతోంది.
ఈ సందర్బంగా మోదీని లక్ష్యంగా చేసుకుని సంచలన ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). తమ పార్టీ పాలించిన కాలంలో ప్రభుత్వ ఆస్తులను కాపాడుకుంటూ వస్తే భారతీయ జనతా పార్టీ వచ్చాక వాటన్నింటిని గంప గుత్తగా బడా బాబులకు, వ్యాపారవేత్తలకు, కార్పొరేట్లకు దోచి పెడుతున్నాడంటూ ధ్వజమెత్తారు.
ఇందుకోసమేనా ప్రజలకు అధికారం ఇచ్చిందంటూ ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో మోదీకి ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు రాహుల్ గాంధీ. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను గాలికొదిలేశారని, తన వ్యక్తిగత ప్రచారం మీద ఉన్న శ్రద్ద దేశం పై లేకుండా పోయిందన్నారు.
ఇండోర్ కు పాదయాత్ర చేరుకున్న సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). ద్రవ్యోల్బణం ఎన్నడూ లేనంతగా పెరిగిందని, నిరుద్యోగం తీవ్ర సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ప్రధానమంత్రి ఇప్పుడు కనీసం 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేక పోయారని దీనికి ఏం సమాధానం చెబుతారంటూ ప్రశ్నించారు.
చైనా వల్ల ముప్పేమిటో కానీ దానికంటే ఎక్కువగా నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ.
Also Read : ప్రైవసీ అన్నది పర్మినెంట్ కాదు – కేంద్రం