Rahul Gandhi Modi : ద్వేష‌పూరిత బుల్డోజర్ల‌ను ఆపండి

మోదీపై నిప్పులు చెరిగిన రాహుల్

Rahul Gandhi  : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న మ‌రోసారి నిప్పులు చెరిగారు కేంద్రంలోని మోదీ స‌ర్కార్ పై. ఎనిమిదేళ్ల కాలంలో మ‌తం పేరుతో, ప్రాంతాల పేరుతో విభ‌జించ‌డం ప‌రిపాటిగా మారింద‌ని పేర్కొన్నారు.

బుల్డోజ‌ర్ల పేరుతో జ‌నాన్ని భ‌యాందోళ‌న‌కు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు రాహుల్ గాంధీ(Rahul Gandhi ). ప్ర‌ధానిని టార్గెట్ చేశారు. ఢిల్లీలోని హింసాకాండ‌కు గురైన జ‌హంగీర్ పురి , మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో బీజేపీ ఆరోపిస్తున్న అల్లర్ల‌కు వ్య‌తిరేకంగా బుల్డోజ‌ర్ల‌ను ఉప‌యోగించ‌డం దారుణ‌మ‌న్నారు.

దీనిని ఆయ‌న ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావిస్తూ ట్విట్ట‌ర్ లో పేర్కొన్నారు. బుల్డోజ‌ర్ల పేరుతో ద్వేషాన్ని క‌క్కుతున్నార‌ని నిప్పులు చెరిగారు రాహుల్ గాంధీ. ఆయ‌న ఈ ప్ర‌య‌త్నాల‌ను ద్వేష‌పూరిత బుల్డోజ‌ర్లంటూ క్యాప్ష‌న్ జ‌త చేశారు.

దేశంలో ఓ వైపు ప్ర‌జా స‌మ‌స్య‌లు పెరిగి పోతున్నాయ‌ని, ద్ర‌వ్యోల్బ‌మ‌ణం, నిరుద్యోగిత రోజు రోజుకు పెరిగి పోతోంద‌ని ఆరోపించారు. ప్ర‌ధానంగా బొగ్గు కొర‌త అధికాకంగా ఉంద‌ని వెల్ల‌డించారు.

ప‌వ‌ర్ ప్లాంట్ల‌లో బొగ్గు నిల్వ‌లు క‌నిష్ట స్థాయికి చేరుకున్నాయ‌ని వాపోయారు. ఇదిలా ఇలాగే కొన‌సాగిస్తూ పోతే భార‌త దేశం మ‌రో శ్రీ‌లంక లాగా త‌యారు కావ‌డం ఖాయ‌మ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు రాహుల్ గాంధీ.

ద్వేష పూరిత బుల్డోజ‌ర్ల‌ను స్విచ్ ఆఫ్ చేయండి ప‌వ‌ర్ ప్లాంట్ల‌ను ఆన్ చేయండి అని పిలుపునిచ్చారు. ఎనిమిదేళ్ల కాలంలో భార‌త దేశంలో కేవ‌లం 8 రోజుల బొగ్గు నిల్వ‌లు మాత్ర‌మే ఉన్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు రాహుల్ గాంధీ.

మోదీజీ ప్ర‌తిష్టంభ‌న ఏర్ప‌డుతోంది. విద్యుత్ చిన్న ప‌రిశ్ర‌మ‌లకు క‌రెంట్ స‌ర‌ఫ‌రా కాద‌ని తెలిపారు.

Also Read : పంజాబ్ సీఎంపై కుమార్ విశ్వాస్ ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!