Rahul Gandhi : ముమ్మాటికీ మోదీదే తప్పు – రాహుల్
మణిపూర్ విషయంలో మౌనం ఎందుకు
Rahul Gandhi : ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన గురువారం ఓ వీడియోను పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానిని నిలదీశారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ప్రధాని ఇలాగేనా దేశం పట్ల వ్యవహరించేది అంటూ ప్రశ్నించారు.
Rahul Gandhi Asking
మణిపూర్ కోసం ఎందుకు నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారో దేశ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ(Rahul Gadhi). గత మే 3వ తేదీ నుంచి మణిపూర్ రగులుతోందని ఎందుకు స్పందించ లేక పోయారో స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
తమ కాషాయ భావజాలం పూర్తిగా మణిపూర్ ను కాల్చేసిందని పూర్తిగా మోదీకి తెలుసని ధ్వజమెత్తారు. ఈ మొత్తం హింసాత్మక ఘటనలకు, అల్లర్లకు బాధ్యత వహించాల్సింది ప్రధానమంత్రి తప్ప మరెవరో కాదన్నారు.
ఎవరి ప్రయోజనాలను కాపాడేందుకు ఇంకా తాత్సారం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు రాహుల్ గాంధీ. ఇకనైనా ఆలోచించు కోవాలని తాను చేసిన తప్పిదానికి రాబోయే రోజుల్లో శిక్ష అనుభవించక తప్పదన్నారు.
Also Read : Bhola Shankar Trailer : భోళా శంకర్ ట్రైలర్ అదుర్స్