Rahul Gandhi : దాడులకు జంకను మోదీకి భయపడను
నిప్పులు చెరిగిన ఎంపీ రాహుల్ గాంధీ
Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను మోదీ లాంటి వాళ్లను ఎంతో మందిని చూశానని, ప్రధానికి భయపడే ప్రసక్తి లేదని కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్ని దాడులు చేసినా పట్టంచుకోనన్నారు.
ఏదో ఒక వంకతో ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం కేంద్ర ప్రభుత్వానికి అలవాటుగా మారిందని మండిపడ్డారు. ఏం జరిగిందని తాము భయపడాలంటూ ఎదురు ప్రశ్న వేశారు.
ఈ దేశాన్ని ఓ వైపు అమ్మకానికి పెట్టిన మోదీ తనను భయపెట్టాలని అనుకోవడం ఓ భ్రమ మాత్రమేనని పేర్కొన్నారు. తన కుటుంబం యావత్తు దేశం కోసం సేవలు అందించిందన్నారు.
కానీ మోదీ సర్కార్ కేవలం కొంత మందికి మాత్రమే పని చేస్తోందని 133 కోట్ల ప్రజలకు మాత్రం కాదన్నారు. ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చేసిన ఘనత ఆయనదేనన్నారు రాహుల్ గాంధీ(Rahul Gandhi).
గతంలో లేనంతగా సీరియస్ గా స్పందించారు. ఇది పూర్తిగా పక్కదారి పట్టించడం తప్ప మరొకటి కాదన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగి పోయిందన్నారు.
ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచు కోవడం లేదని దానిని తాము ప్రస్తావిస్తే వాటి నుంచి ప్రజల మనస్సు తప్పించేందుకే తమపై ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు రాహుల్ గాంధీ.
నేషనల్ హెరాల్డ్ కేసు పేరుతో ఒత్తిడి చేస్తే తాము భయపడతామని మోదీ, అమిత్ షా అనుకుంటున్నారు. తాము మరింత గొంతు పెంచుతామే తప్పా ఊరుకోబోమంటూ ఆ ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చారు.
Also Read : కేంద్రం నిర్వాకం కాంగ్రెస్ ఆగ్రహం