Rahul Gandhi : మోదీ జాత‌ర ప్ర‌జాస్వామ్యానికి పాత‌ర

నిప్పులు చెరిగిన ఎంపీ రాహుల్ గాంధీ

Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ , వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. మ‌రోసారి ఆయ‌న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని, కేంద్ర ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేశారు.

ఈ దేశంలో మోదీ కొలువు తీరాక ప్ర‌జాస్వామ్యానికి ప్రమాదం ఏర్ప‌డింద‌న్నారు. రాచ‌రిక పాల‌న సాగుతోంద‌న్నారు. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ద్ర‌వ్యోల్బ‌ణం, నిరుద్యోగం, ధ‌రాభారం కోలుకోలేని రీతిలో కొన‌సాగుతోంద‌ని ఎద్దేవా చేశారు.

పేద‌లు, మ‌ధ్య‌త‌ర‌గి ప్ర‌జ‌ల పాలిట మోదీ ప్ర‌భుత్వం శాపంగా మారింద‌ని ఆరోపించారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi)  శుక్ర‌వారం మాట్లాడారు. ఇదే స‌మ‌యంలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

భార‌త దేశం ప్ర‌జాస్వామ్య మ‌ర‌ణాన్ని చూస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ధ‌ర‌లు పెంచ‌డాన్ని నిర‌సిస్తూ శుక్ర‌వారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో మోదీ ఇంటి ముట్ట‌డికి పిలుపునిచ్చింది.

ఎంపీల ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ వ‌ర‌కు మార్చ్ చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించింది. దీంతో పెద్ద ఎత్తున దేశ రాజ‌ధాని ఢిల్లీలో పోలీసుల‌ను మోహ‌రించారు. ఈ సంద‌ర్భంగా స్పందించారు రాహుల్ గాంధీ.

పార్ల‌మెంట్ లో మాట్లాడేందుకు, నిర‌స‌నలు తెలిపేందుకు ప‌ర్మిష‌న్ లేదు. శాంతియుతంగా ఆందోళ‌న చేప‌ట్టిన మ‌మ్మ‌ల్ని అరెస్ట్ చేస్తున్నారు.

ఇది ఇప్పుడున్న దేశ ప‌రిస్థితికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు. మోదీ స‌ర్కార్ కేవ‌లం న‌లుగురు లేదా ఐదుగురు వ్య‌క్తుల ప్ర‌యోజ‌నాల కోస‌మే ప‌ని చేస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు రాహుల్ గాంధీ.

ఎన్ని కేసులు న‌మోదు చేసినా లేదా అరెస్ట్ ల‌కు పాల్ప‌డినా తాము పోరాడుతూనే ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు కాంగ్రెస్ అగ్ర నేత‌. ఇవాళ కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు ప‌రిధి దాటి వ్య‌వ‌హ‌రిస్తున్నాయంటూ మండిప‌డ్డారు.

Also Read : ద్ర‌వ్యోల్బ‌ణం ముప్పు వ‌డ్డీ రేట్ల పెంపు

Leave A Reply

Your Email Id will not be published!