Rahul Gandhi Modi : మౌదీ మౌనం రాహుల్ ఆగ్ర‌హం

మ‌ణిపూర్ పై మౌన‌మేల మోదీ

Rahul Gandhi Modi : ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఫ్రాన్స్ లో ప‌ర్య‌టించ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఎవ‌రి కోసం వెళ్లార‌లో చెప్పాల‌ని కోరారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఓ వైపు మ‌ణిపూర్ కాలి పోతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారో ప్ర‌ధాని చెప్పాల‌ని రాహుల్ డిమాండ్ చేశారు. మ‌ణిపూర్ కు కూడా మోదీ ప్ర‌ధాని అన్న విష‌యం తెలుసు కోవాల‌న్నారు. ఆ రాష్ట్రం కూడా ఈ దేశంలో ఉంద‌నే విష‌యం మ‌రిచి పోయారా అని మండిప‌డ్డారు రాహుల్ గాంధీ(Rahul Gandhi).

వ్య‌క్తిగ‌త ప్ర‌చారంపై ఉన్నంత శ్ర‌ద్ద దేశంలో చోటు చేసుకున్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై ఎంత మాత్రం లేద‌న్నారు. ఇది పూర్తిగా బాధ్య‌తా రాహిత్యాన్ని సూచిస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఇప్ప‌టి దాకా మ‌ణిప‌ర్ లో బీజేపీ ప్ర‌భుత్వం కొలువు తీరినా ఎందుక‌ని మంట‌లు అదుపులోకి రావ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు రాహుల్ గాంధీ.

ఈ సంద‌ర్బంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌కలం రేపింది. మ‌ణిపూర్ కాలి పోతోంది. పార్ల‌మెంట్ లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌పై చ‌ర్చిస్తున్నారు. బాధ్య‌త క‌లిగిన ప్ర‌ధాని మోదీ మాత్రం ఎంచ‌క్కా విదేశీ ప్ర‌యాణంలో బిజీగా ఉన్నారంటూ ఎద్దేవా చేశారు.

ఇలాంటి ప్ర‌ధానిని దేశం కోరుకోవ‌డం లేద‌న్నారు. ఓ వైపు దేశం కాలి పోతుంటే ఫిడేల్ వాయించుకుని కూర్చున్న‌ట్టుగా మోదీ ప్ర‌వ‌ర్త‌న ఉందంటూ మండిప‌డ్డారు రాహుల్ గాందీ.

Also Read : Gopal Rai : ఢిల్లీని ముంచేందుకు బీజేపీ కుట్ర

 

Leave A Reply

Your Email Id will not be published!