Rahul Gandhi Security : భ‌ద్ర‌తా వైఫ‌ల్యం రాహుల్ ఆగ్ర‌హం

భార‌త జోడో యాత్ర నిలిపివేత

Rahul Gandhi Security : భ‌ద్ర‌తా లోపం కార‌ణంగానే తాను చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర‌ను అర్ధాంత‌రంగా నిలిపి వేయాల్సి వ‌చ్చింద‌ని కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాహుల్ చేప‌ట్టిన యాత్ర జ‌మ్మూ లో పూర్త‌యింది. శుక్ర‌వారం కాశ్మీర్ లోని బనిహాల్ కు చేరుకుంది.

పాద‌యాత్ర‌లో జ‌మ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమ‌ర్ అబ్దుల్లా పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో క‌లిసి జ‌త క‌ట్టారు. ఇవాళ 11 కిలోమీట‌ర్లు న‌డవాల్సి ఉండ‌గా కిలోమీట‌ర్ త‌ర్వాత ఆగాల్సి వ‌చ్చింది సెక్యూరిటీ(Rahul Gandhi Security) లేక పోవ‌డం వ‌ల్ల‌. భ‌ద్రతా వైఫ‌ల్యం కార‌ణంగానే తాము పాద‌యాత్ర చేప‌ట్ట‌లేక పోయామ‌ని స్ప‌ష్టం చేశారు.

30 నిమిషాల‌కు పైగా నేను, ఒమ‌ర్ అబ్దుల్లా అడుగు కూడా వేయ లేదంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కాశ్మీర్ లోయ లోకి ప్ర‌వేశించ‌డంతో చాలా తీవ్ర‌మైన భ‌ద్ర‌తా లోపాలు ఉన్నాయ‌ని ఆరోపించారు. దీంతో పాద‌యాత్రను అర్ధాంత‌రంగా ర‌ద్దు చేసిన‌ట్టు కాంగ్రెస్ పార్టీ వెల్ల‌డించింది.

దీనిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు కేసీ వేణుగోపాల్ . ఇవాళ రాహుల్ గాంధీ 20 కిలోమీట‌ర్లు న‌డ‌వాల్సి ఉండ‌గా దాదాపు కిలోమీట‌రు త‌ర్వాత సెక్యూరిటీ లోపం కార‌ణంగా ఆగాల్సి వ‌చ్చింది. దీనిపై తీవ్రంగా ఫైర్ అయ్యారు మాజీ సీఎం ఒమ‌ర్ అబ్దుల్లా.

శ్రీ‌న‌గ‌ర్ కు వెళ్లే మార్గంలో బ‌నిహాల్ ట‌న్నెల్ దాటుతుండ‌గా ఊహించ‌ని విధంగా పెద్ద ఎత్తున జ‌నం ఎదురు చూస్తున్నార‌ని కానీ సెక్యూరిటీ కార‌ణంగా వెళ్ల‌లేక పోయార‌ని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi Security) చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి. దీనిపై కేంద్రం ఇంకా స్పందించ లేదు.

Also Read : నితీశ్ పై ఉపేంద్ర కుష్వాహా క‌న్నెర్ర‌

Leave A Reply

Your Email Id will not be published!