Rahul Gandhi : ఆస్పత్రి అభివృద్దికి రాహుల్ ఆసరా
విద్యుత్ సమస్య తీరేందుకు రూ. 50 లక్షలు
Rahul Gandhi : వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ తన ఎంపీ ఫండ్స్ నుంచి ఆస్పత్రి నిర్వహణ, అభివృద్దికి కేటాయించారు. ఆదివారం కేరళలోని వాయనాడు లోక్ సభ నియోజకవర్గంలోని ఆస్పత్రిలో విద్యుత్ అంతరాయం లేకుండా ఉండేందుకు నిధులు సమకూర్చారు. తన ఎంపీ ఫండ్ నుంచి రూ. 50 లక్షలు మంజూరు చేయించారు. దీని వల్ల రోగులకు ఎలాంటి ఇబ్బంది అంటూ ఉండదని పేర్కొన్నారు రాహుల్ గాంధీ.
Rahul Gandhi Words
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు. ఆస్పత్రిలో ఈ కొత్త భాగాన్ని తాను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). గతంలో ఆస్పత్రిలో కరెంట్ కోతల కారణంగా రోగులు, వైద్యులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడేవన్నారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పారు ఎంపీ. కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుత్ లైన్ వల్ల ఈ సమస్యకు ముగింపు కలుగుతుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు.
విషయం తెలుసుకున్న వెంటనే ఎంపీ ఫండ్స్ నుంచి నిధులు మంజూరు చేశానని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. ఇందులో భాగంగా ఈ ప్రాజెక్టులో పని చేసిన అధికారులు, ఇతరులకు తాను ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని స్పష్టం చేశారు. ఇక నుంచి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రోగులకు తెలిపారు.
Also Read : Punjab Schools : పంజాబ్ లో విద్యా విప్లవం