Rahul Gandhi : తెలంగాణపై రాహుల్ ఫోకస్
25, 26న ఎన్నికల ప్రచారం
Rahul Gandhi : తెలంగాణలో ఈసారి ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. రాష్ట్రంలో కొలువు తీరిన బీఆర్ఎస్ పార్టీని ఎలాగైనా ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కీలకమైన స్థానాలకు ముందస్తుగానే అభ్యర్థులను ఖరారు చేసింది. ఒకటి రెండు చోట్ల అభ్యంతరాలు వ్యక్తమైనా చివరకు వాటిని కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేసింది.
Rahul Gandhi hard work
ఇదే సమయంలో బీఆర్ఎస్ కు ధీటుగా పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేపట్టింది. ప్రధానంగా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందంటూ ఆరోపిస్తోంది. సామాజిక మాధ్యమాలలో కాంగ్రెస్ పార్టీ హోరెత్తిస్తోంది. దీనిని సమర్థవంతంగా నిర్వహించడంలో ఆ పార్టీ సక్సెస్ అయ్యిందని చెప్ప వచ్చు. ఇక ప్రచారంలో భాగంగా ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ(Rahul Gandhi) తెలంగాణపై ఫోకస్ పెట్టారు.
ఇప్పటికే ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సైతం ఇక్కడికి వచ్చారు. పలు నియోజకవర్గాలలో పర్యటించారు. జనాన్ని ప్రభావితం చేసేలా ప్రసంగించారు. ఇక రాహుల్ గాంధీ సైతం ఈనెల 25, 26 తేదీలలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.
ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించే విజయ భేరి సభలకు హాజరు కానున్నారు రాహుల్ గాంధీ. 25న బోధన్, ఆదిలాబాద్ , వేములవాడ లలో పాల్గొంటారు. 26న కామారెడ్డి, సంగారెడ్డి, జహీరాబాద్ లో రాహుల్ గాంధీ ప్రచారం చేస్తారు.
Also Read : BS Yediyurappa : దివాళా అంచున కర్ణాటక