Shashi Tharoor : రాహుల్ గాంధీ చెప్పినందుకే బ‌రిలో ఉన్నా

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన కాంగ్రెస్ ఎంపీ

Shashi Tharoor : తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శి థ‌రూర్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్‌, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ త‌నను కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేయ‌మ‌ని కోరార‌ని వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం అక్టోబ‌ర్ 17న కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. 19న పార్టీ చీఫ్ ఫ‌లితాలు ప్ర‌క‌టించ‌నున్నారు.

ఈ విష‌యాన్ని ఎన్నిక‌ల ప్రిసైడింగ్ ఆఫీస‌ర్ మ‌ధుసూద‌న్ మిస్త్రీ ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు. తన‌పై అస‌మ్మ‌తి వ‌ర్గానికి చెందిన నాయ‌కుడిగా ముద్ర వేశారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కానీ తాను అస‌లైన‌, సిస‌లైన కాంగ్రెస్ వాదినంటూ స్ప‌ష్టం చేశారు శ‌శి థ‌రూర్(Shashi Tharoor). త‌న ప్ర‌య‌త్నంలో ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చిన వారికి ద్రోహం చేయ‌బోన‌ని చెప్పారు ఎంపీ.

అయితే గాంధీ ఫ్యామిలీ నుంచి మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే బ‌రిలో ఉన్నారు. ఇక జి23 గ్రూపులో కీల‌కమైన నాయ‌కుడిగా ఉన్న శ‌శి థ‌రూర్ పోటీ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఖ‌ర్గే, థ‌రూర్ మ‌ధ్యే యుద్దం కొన‌సాగుతోంది. ఇదిలా ఉండ‌గా త‌న‌ను త‌ప్పు కోవాలంటూ రాహుల్ గాంధీ కోరార‌ని చేసిన ప్ర‌చారం పూర్తిగా అవాస్త‌వ‌మన్నారు.

రాహుల్ గాంధీనే పోటీ చేయాలంటూ కోరార‌ని చెప్పారు శ‌శి థ‌రూర్. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. విజ‌య ద‌శ‌మి సంద‌ర్భంగా బుధ‌వారం కేర‌ళ‌లో శ‌శి థ‌రూర్ మీడియాతో మాట్లాడారు. పార్టీకి ప్ర‌యోజ‌నం చేకూర్చేలా పోటీ చేయ‌డం వ‌ల్ల మాజీల‌ను ఉప‌సంహ‌రించు కోమ‌ని గాంధీ చెప్పార‌ని చేసిన వ్యాఖ్య‌ల్లో వాస్త‌వం లేద‌న్నారు ఎంపీ.

Also Read : ధైర్యానికి ప్ర‌తీక విజ‌య ద‌శ‌మి – మోదీ

Leave A Reply

Your Email Id will not be published!