YS Sharmila Rahul : రాహుల్ కు ష‌ర్మిల థ్యాంక్స్

వైఎస్ కు అగ్ర నేత నివాళి

YS Sharmila Rahul : దివంగ‌త సీఎం డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పుట్టిన రోజు జూలై 8. శ‌నివారం ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా ప‌లువురు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయ‌కులు ప్ర‌జా నాయ‌కుడిని స్మ‌రించుకున్నారు. పార్టీ ప‌రంగా వైఎస్సార్ చేసిన సేవ‌లను కొనియాడారు. ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా రాజ‌శేఖ‌ర్ రెడ్డికి ఘ‌నంగా నివాళులు అర్పించారు.

ఉమ్మ‌డి ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రానికి సీఎంగా వైఎస్సార్ చేసిన సేవ‌లు ప్ర‌శంస‌నీయ‌మ‌ని పేర్కొన్నారు రాహుల్ గాంధీ. త‌న జీవితాన్ని అంకితం చేసిన మ‌హ‌నీయుడంటూ కితాబు ఇచ్చారు . ఆయ‌న భౌతికంగా మ‌న మ‌ధ్య లేక పోయిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల గుండెల్లో, పేద‌ల బ‌తుకుల్లో ఎల్ల‌ప్ప‌టికీ చిర‌స్మ‌ర‌ణీయుడిగా ఉంటారంటూ పేర్కొన్నారు రాహుల్ గాంధీ.

ఇదిలా ఉండ‌గా త‌న తండ్రికి ఇడుపుల పాయ‌లో నివాళులు అర్పించారు ఆయ‌న కూతురు, వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌(YS Sharmila). ఆమెతో పాటు త‌ల్లి వైఎస్ విజ‌య‌మ్మ సైతం ఇవాళ నివాళులు అర్పించారు. లోకం ఉన్నంత వ‌ర‌కు త‌న భ‌ర్త బ‌తికే ఉంటాడ‌ని స్ప‌ష్టం చేసింది భార్య విజ‌య‌మ్మ‌.

ఈ సంద‌ర్భంగా వైఎస్ ష‌ర్మిల త‌న తండ్రికి నివాళులు అర్పించినందుకు రాహుల్ గాంధీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ప్ర‌జ‌ల కోసం నిబ‌ద్ద‌త‌తో ప‌ని చేసిన అరుదైన నాయ‌కుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి అంటూ స్ప‌ష్టం చేశారు.

Also Read : Nallari Kiran Kumar Reddy Modi : నెట్టింట్లో న‌ల్లారి వైర‌ల్

Leave A Reply

Your Email Id will not be published!