Rahul Gandhi Nehru : స్వాప్నికుడు మహనీయుడు – రాహుల్
జవహర్ లాల్ నెహ్రూ కు నివాళి
Rahul Gandhi Nehru : జవహర్ లాల్ నెహ్రూ గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ(Rahul Gandhi). తాను ఆయన నుంచి ఎంతో స్పూర్తి పొందానని స్పష్టం చేశారు. ఈ దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించ దగిన ఏకైక నాయకుడు నెహ్రూ అని పేర్కొన్నారు. ఆయన స్వాప్నికుడే కాదు మహనీయుడని కొనియడారు. ఎంతో ముందు చూపుతో సోషలిజం అమలు చేసిన గొప్ప వ్యక్తి అని స్మరించుకున్నారు.
ఇదిలా ఉండగా భారత దేశానికి తొలి ప్రధాన మంత్రిగా పని చేసిన జవహర్ లాల్ నెహ్రూ వర్దంతి ఇవాళ. ప్రతి ఏటా మే 27న నెహ్రూ వర్దంతిని నిర్వహిస్తారు. ప్రభుత్వం అధికారికంగా చేపడుతుంది కూడా. ఈ సందర్భంగా నెహ్రూ సమాధి వద్ద పూలమాలలు ఉంచి నివాళులు అర్పించారు రాహుల్ గాంధీ. ఇక 1947లో దేశానికి స్వతంత్రం వచ్చింది. నెహ్రూను ప్రధానిగా ఎన్నుకున్నారు. ఆయన హయాంలో దేశం అన్ని రంగాలలో కీలకమైన మార్పులు చవి చూసింది.
ఈ దేశం గురించి ఎన్నో కలలు కన్నారు. ప్రాజెక్టులు, పరిశోధనలు, విశ్వ విద్యాలయాలు , కంపెనీలు రూపుదిద్దుకున్నాయి. యావత్ ప్రపంచం బాగుండాలని కలలు కన్నారు. ఈ దేశంలో శాంతి , సామరస్యం వెల్లి విరియాలని కోరుకున్నారు జవహర్ లాల్ నెహ్రూ. ఇదిలా ఉండగా శనివారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తో పాటు మాజీ చీఫ్ , సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ నెహ్రూకు నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీనియర్ నాయకులు జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్ సైతం నివాళులు అర్పించారు.
Also Read : PM Modi Tribute
