Rahul Gandhi : తండ్రీ నిన్ను తలంచి – రాహుల్ గాంధీ
రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులు
Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం కన్యాకుమారి టు కాశ్మీర్ భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.
ఈ సందర్భంగా తమిళనాడులోని పెరంబదూర్ లో ఏర్పాటు చేసిన తన తండ్రి దివంగత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు.
మత, విద్వేష, వేర్పాటువాద రాజకీయాలకు తన తండ్రి బలై పోయారని కానీ తాను దేశాన్ని అలా కానివ్వ బోనంటూ స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. ఈ యాత్ర 150 రోజుల పాటు 3,500 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది.
రోజుకు ఆరు లేదా ఏడు గంటల పాటు కొనసాగుతుంది. మే 21, 1991న ఆత్మాహుతి దాడిలో తన తండ్రి దుర్మరణం పాలయ్యారు. ప్రేమ ద్వేషాన్ని జయిస్తుంది. ఆశ భయాన్ని ఓడిస్తుంది.
కలిసి గెలుస్తామని ఆయన భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇవాళ దేశం మోదీ నేతృత్వంలోని బీజేపీ దేశంలో కులం, ప్రాంతం, మతం పేరుతో విద్వేష పూరిత రాజకీయాలను ప్రేరేపిస్తోందని, దీని ద్వారా లబ్ది పొందాలని అనుకుంటోందంటూ నిప్పులు చెరిగారు రాహుల్ గాంధీ(Rahul Gandhi).
ఇదిలా ఉండగా కన్యాకుమారి లోని మహాత్మాగాంధీ మండపంలో జరిగే కార్యక్రమానికి గాంధీతో పాటు సీఎం ఎంకే స్టాలిన్ హాజరవుతారు.
ఇదిలా ఉండగా ఈ జోడో యాత్రలో ప్రతి రోజూ నాయకులు, కార్యకర్తలు, బాధ్యులు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6.30 గంటల వరకు కొనసాగనుంది.
Also Read : మెగా కాంగ్రెస్ యాత్రకు శ్రీకారం