Rahul Gandhi Truck Ride : ట్రక్ డ్రైవర్లతో రాహుల్ ముచ్చట
సిద్దూ మూసేవాలా పాటలంటే ఇష్టం
Rahul Gandhi Truck Ride : ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. ఆయన అమెరికా టూర్ ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో యుఎస్ లో ట్రక్ డ్రైవర్లు ఎక్కువగా భారతీయులే. ప్రధానంగా ఇందులో పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారున్నారు. గతంలో పార్టీకి సంబంధించి ఎంపీగా విదేశీ పర్యటన వెళ్లారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). కానీ అనుకోని రీతిలో ఆయన వేటుకు గురయ్యారు.
ఎంపీ నుంచి అనర్హత వేటు పడింది. దీంతో సామాన్య పౌరుడిగానే అమెరికాను సందర్శించారు. ఆపై వివిధ వేదికలపై తన వాణిని వినిపించారు. భారత దేశం పట్ల తనకున్న అంచనాలు, ఆలోచనలను పంచుకున్నారు. ఇదే సమయంలో ప్రధాని మోదీని ఏకి పారేశారు.
ఇదే క్రమంలో అమెరికా నగర జీవితంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పంజాబీ డ్రైవర్లను కలుసుకున్నారు రాహుల్ గాంధీ. ఆపై వారితో కలిసి ట్రక్కులో ప్రయాణం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నిమిషాల్లోనే వైరల్ గా మారాయి.
ఈ సందర్బంగా ఇటీవల దారుణ హత్యకు గురైన ప్రముఖ పాప్ , పంజాబీ సింగర్ సిద్దూ మూసేవాలా గురించి కూడా ఆసక్తికరమైన చర్చ జరిగింది. తనకు కూడా సిద్దూ పాటలంటే ఇష్టమని చెప్పడం విశేషం. మొత్తంగా అమెరికా రైడ్ జర్నీ రాహుల్ గాంధీని హీరోని చేసింది.
Also Read : Farmers Protest : హర్యానా సర్కార్ పై రైతన్నల కన్నెర్ర
