Rahul Gandhi : అధికారం అశాశ్వ‌తం స‌త్యం శాశ్వ‌తం

కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ

Rahul Gandhi : కాంగ్రెస్ మాజీ చీఫ్‌, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi)  నిప్పులు చెరిగారు. ఆయ‌న కేంద్ర ప్ర‌భుత్వాన్ని తూర్పార బ‌ట్టారు. అత్యంత బాధ్యాతా రాహిత్యంతో వ్య‌వ‌హ‌రిస్తోందంటూ మండిప‌డ్డారు.

పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌ల్లో చ‌ర్చ‌లు జ‌ర‌గ‌కుండానే వ్య‌వ‌హరించ‌డం ప్ర‌జాస్వామ్యానికి మాయని మ‌చ్చ అని పేర్కొన్నారు.

జీఎస్టీ, ద్ర‌వ్యోల్బ‌ణం, అగ్నిప‌థ్ , ఏజెన్సీల దుర్వినియోగం ఇలా ప్ర‌తి అంశాన్ని లేవ‌దీసి ప్ర‌తి సంద‌ర్భంలోనూ స్పీక‌ర్ వాయిదా వేస్తున్నార‌ని తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు రాహుల్ గాంధీ

. గురువారం ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ఇవాళ మోదీ ప్ర‌భుత్వం రాచ‌రిక పాల‌న సాగిస్తోంద‌ని మండిప‌డ్డారు. బహిరంగంగానే ప్ర‌జ‌ల గొంతు నొక్కే ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఈ దుర‌హంకార ధోర‌ణి ఎంత మాత్రం మంచిది కాద‌న్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించాల్సిన బాధ్య‌త విప‌క్షాల‌పై ఉంది. కానీ ప్ర‌భుత్వం కావాల‌ని అడ్డుకోవ‌డం దారుణ‌మ‌ని పేర్కొన్నారు.

ఏ ఒక్క దానిని విడిచి పెట్ట‌డం లేదు. ప్ర‌జ‌లు నిత్యం వాడే వస్తువులపై కూడా ప‌న్ను క‌ట్ట‌మ‌ని అన‌డం ప్ర‌భుత్వ ప‌నితీరును తెలియ చేస్తోంద‌న్నారు.

ఇందు కోస‌మేనా మోదీజీ(PM Modi) మీకు అధికారాన్ని అప్ప‌గించింది. ఒక్క‌సారి ఈ ఎనిమిదేళ్ల కాలంలో మీరు చేసింది ఏమీ లేదు. ప్ర‌జ‌ల్ని లూటీ చేయ‌డం త‌ప్ప ఒర‌గ బెట్టింది ఏమీ లేదంటూ ఫైర్ అయ్యారు రాహుల్ గాంధీ.

వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేయ‌డం, వాటిని అమ్మ‌కానికో లేదా లీజుకో ఇవ్వ‌డం మాత్ర‌మే ఇంత వ‌ర‌కు మీరు దేశానికి చేసిన సేవ అంటూ రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.

Also Read : ద్రౌప‌ది ముర్ము ఘ‌న విజ‌యం

Leave A Reply

Your Email Id will not be published!