KTR Rahul : దమ్ముంటే అమేథీలో గెలిచి చూపించు – కేటీఆర్
కేసీఆర్ ను విమర్శించే హక్కు లేదు
KTR Rahul : భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ టీఆర్ఎస్ పార్టీపై చేసిన కామెంట్స్ పై నిప్పులు చెరిగారు తెలంగాణ ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్. ఆయనకు తమ పార్టీ నాయకుడు, సీఎం కేసీఆర్ ను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు.
భారత రాష్ట్ర సమితితో కలిసి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోందని దీనిపై మీరేమంటారు అన్న ప్రశ్నకు రాహుల్ గాంధీ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. రాష్ట్రంలో కానీ లేదా దేశంలో కానీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీతో కలిసి పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
భారత్ జోడో యాత్ర సందర్భంగా శంషాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేగింది. అంతే కాదు ఈ దేశంలో పార్టీ పెట్టుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. అమెరికాతో పాటు చైనాలో కూడా బీఆర్ఎస్ పోటీ చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కుండ బద్దలు కొట్టారు రాహుల్ గాంధీ.
గత కొంత కాలంగా తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి బరిలోకి దిగుతాయని ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ తరుణంలో తమ పార్టీ పరంగా స్టాండ్ ఏమిటో తెలిపారు రాహుల్ గాంధీ. దీనిపై మంత్రి కేటీఆర్(KTR Rahul) మండిపడ్డారు. ముందు అమేథీలో గెలిచి చూపించాలని ఆ తర్వాత దేశ నాయకుడు కావాలంటూ ఎద్దేవా చేశారు.
ఇదిలా ఉండగా 2019 ఎన్నికల్లో కేరళ లోని వాయనాడుతో పాటు యూపీలో అమేథీలో రెండు చోట్ల పోటీ చేశారు రాహుల్ గాంధీ. వాయనాడులో గెలుపొంది అమేథీలో సీటు కోల్పోయారు.
Also Read : తమిళిసై ఢిల్లీ టూర్ పై ఉత్కంఠ