Rahul Luna Dog Viral : ల‌వ్లీ ‘లూనా’ రాహుల్ థిల్లానా

సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్

Rahul Luna Dog Viral : దేశ వ్యాప్తంగా ఇప్పుడు రాహుల్ గాంధీ వైర‌ల్ గా మారి పోయారు. ఆయ‌న ఏ ముహూర్తాన భార‌త్ జోడో యాత్ర చేప‌ట్టాడో కానీ ఇప్పుడు దేశంలో ఉద‌యం నుంచి రాత్రి దాకా మీడియా ఫోక‌స్ పెట్ట‌క పోయినా సోష‌ల్ మీడియాలో రాహుల్ క‌నిపిస్తున్నారు. వినిపిస్తున్నారు. అంత‌టా తానై విస్త‌రిస్తున్నారు. ఇది భార‌తీయ జ‌న‌తా పార్టీని కూడా ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేలా చేసింది.

ఆయ‌న ఎవ‌రినీ విమ‌ర్శించ‌డం లేదు. ఆపై భార‌త దేశం ఏక‌త కోసం ప్ర‌య‌త్నం చేస్తున్నాన‌ని ప్ర‌క‌టించారు. ఆ మేర‌కు రాహుల్ కు ఊహించ‌ని రీతిలో స్పంద‌న ల‌భిస్తోంది. ఈ త‌రుణంలో హ‌ర్యానాలో ప్ర‌స్తుతం కొన‌సాగుతోంది రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర . ఈ యాత్రలో సెంట‌ర్ ఆఫ్ ది అట్రాక్ష‌న్ గా నిలిచింది లూనా(Rahul Luna Dog Viral).

లూనా అతిథిగా మారి పోయింది. ఈ లూనా ఎవ‌రిదో కాదు త‌న సోద‌రి కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ పెంచుకుంటున్న కుక్క (శున‌కం ) లూనా. ఇది రాహుల్ గాంధీ ఒడిలో ఎంచ‌క్కా ఒదిగి పోయింది. ప్ర‌స్తుతం దీనిని ముద్దు పెట్టుకున్న రాహుల్ ఫోటోలు నెట్టింట్లో షేక్ చేస్తున్నాయి.

క్ష‌ణాల్లో వైర‌ల్ గా మారాయి. జాతీయ మీడియా సైతం ఈ లూనాను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించ‌డం విస్తు పోయేలా చేసింది. ఈ సంద‌ర్భంగా రాహుల్ గాంధీతో పాటు భార‌త్ జోడో యాత్ర లో శునక రాజసం త‌న ద‌ర్పాన్ని ప్ర‌ద‌ర్శించింది. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. జంతువులు కూడా ప్రేమ‌ను కోరుకుంటున్నాయ‌ని, ఇందుకు రాహుల్ తో లూనా ఉండ‌డం నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొంది.

Also Read : జ‌న హితం పాద‌యాత్ర ల‌క్ష్యం

Leave A Reply

Your Email Id will not be published!