Rahul Mass Leader : రాహుల్ మాస్ లీడర్
పప్పు కాదు ఫైర్
Rahul Mass Leader : ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఇప్పుడు రాటు దేలారు. ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తున్నారు. ఆయన ఎక్కడికి వెళ్లినా జనం ఆదరిస్తున్నారు. ఇటీవలే అమెరికాలో పర్యటించారు. అక్కడ తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. ఎక్కడా తడుము కోలేదు. తనకు ఈ దేశం పట్ల , ప్రపంచం పట్ల ఎలాంటి అవగాహన ఉందో స్పష్టం చేశారు.
తాను చేపట్టిన భారత్ జోడో యాత్రతో భారతీయ జనతా పార్టీ భయానందోళనకు లోనైందన్నారు. తమకు కావాల్సింది మానవత్వం అని, విద్వేషం కాదన్నారు. ఇది తన లక్ష్యమని స్పష్టం చేశారు. కులం , మతం, విద్వేషాల పేరుతో ఓట్ల రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు.
ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) అమెరికా నుంచి ఇండియాకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన న్యూ లుక్ లో దర్శనం ఇచ్చారు. ప్రస్తుతం కారులో దిగుతున్న ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా షేర్ చేసింది. ఈ మేరకు దానిని హైలెట్ చేస్తూ చక్కని క్యాప్షన్ కూడా జత చేసింది.
అన్న మాస్ లీడర్ ఇక కాచుకోండి అంటూ. ఏది ఏమైనా రాహుల్ గాంధీ పప్పు కాదు పరిణతి చెందిన రాజకీయ వేత్త అని ప్రత్యర్థి పార్టీనే ఒప్పుకుంటోంది. మరి రాహులా మజాకా కదూ అంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. ఏది ఏమైనా ఇప్పుడు రాహుల్ జపం చేస్తోంది దేశం.
Also Read : Congress Bus Free : హస్తం మహిళలకు అభయహస్తం