Salman Khurshid : రావణాసురుడి బాటలో బీజేపీ – ఖుర్షీద్
కాంగ్రెస్ నేత సీరియస్ కామెంట్స్
Salman Khurshid : కాంగ్రెస్ అగ్ర నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ నిప్పులు చెరిగారు. ఆయన భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేశారు. రాహుల్ గాంధీ రాముడు కాదంటూ బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. రాహుల్ రాముడు కాక పోవచ్చు కానీ బీజేపీ మాత్రం రావణాసురుడి పాత్రను పోషిస్తోందని, తన దారినే ఎంచుకుని నడుస్తోందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
బుధవారం సల్మాన్ ఖుర్షీద్ మీడియాతో మాట్లాడారు. దేశానికి కావాల్సింది ద్వేషం కాదని ప్రేమ కావాలంటూ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టాడన్ని బీజేపీ తప్పు పట్టడాన్ని తీవ్రంగా మండిపడ్డారు ఖుర్షీద్. ఇది పూర్తిగా విద్వేష పూరిత రాజకీయాలకు పరాకాష్ట అని ఆయన పేర్కొన్నారు.
గత ఎనిమిదిన్నర ఏళ్ల పాలనలో మోదీ దేశానికి ఏం చేశారో చెప్పాలని సల్మాన్ ఖుర్షీద్(Salman Khurshid) డిమాండ్ చేశారు. కాగాను తాను రాహుల్ గాంధీని రాముడితో పోల్చడంలో ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఈ దేశంలో ఇప్పటికే పప్పు అనేది ఎవరో తేలి పోయిందని, జనం గుర్తించారని ఎద్దేవా చేశారు సల్మాన్ ఖుర్షీద్.
రాహుల్ గాంధీ రాముడు కాక పోవచ్చు..కానీ రాముడు చూపిన బాటలో నడుస్తున్నాడని పేర్కొన్నారు. కానీ బీజేపీ చేస్తున్నది ఏంటి.వాళ్లు రావణాసురుడిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళుతున్నారని, విద్వేషాలను ఆధారంగా చేసుకుని రాజకీయాలు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
రాహుల్ గాంధీ అన్నింటిని ఎదుర్కొని ముందుకు సాగుతున్నాడు. కానీ వ్యక్తిగత విమర్శలతో బీజేపీ ఎదురుదాడి చేయడం వారి నీచ రాజకీయాలకు పరాకాష్ట అన్నారు. మేమంతా చలిలో ఇబ్బంది పడుతుంటే రాహుల్ మాత్రం ఓ యోగిలా ముందుకు సాగుతున్నాడని సల్మాన్ ఖుర్షీద్ కితాబు ఇచ్చారు.
Also Read : పప్పు ఎవరో తేలి పోయింది – రాహుల్