Rahul Priyanka Gandhi : అమరావతి సభకు అన్నా చెల్లెలు
విస్తృతంగా ఏర్పాట్లు చేసిన జేఏసీ
Rahul Priyanka Gandhi : అమరావతి – దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది అమరావతి రైతుల ఆందోళన. తాము భూములు కోల్పోయామని, నష్ట పరిహారం ఇవ్వడంలో , రాజధానిని మార్చేశారంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ)గా ఏర్పాటయ్యాడు. జేఏసీ ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాలుగా పోరాటం చేస్తూ వచ్చారు.
Rahul Priyanka Gandhi May be come Amaravathi Sabha
ఇందులో భాగంగా త్వరలో ఎన్నికలు రానున్నాయి. అమరావతి రాజధాని ఐక్య సాధన సమితి ధ్యేయంగా ఏర్పాటైన జేఏసీ వరుసగా ఆందోళనలు, పోరాటాలు, నిరసనలు చేస్తూ వచ్చింది. ఇదే సమయంలో తమ పోరాటం పూర్తయి నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 17న అమరావతి రాజధాని సాధికారత సభను ఏర్పాటు చేశారు.
ఇందులో భాగంగా ఈ సభకు టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఇదే సమయంలో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో నేతలు ఢిల్లీకి వెళ్లారు. ఏఐసీసీ నేతలను కలుసుకున్నారు. వీరిలో ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీతో(Rahul Gandhi) పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని హాజరు కావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా తాము కూడా హాజరు కానున్నట్లు హామీ ఇచ్చినట్లు సమాచారం.
Also Read : Telangana Speaker : రేపే తెలంగాణ స్పీకర్ ఎన్నిక