Rahul Priyanka Gandhi : నాన్నా నీ జ్ఞాపకం మిగిలే ఉంది
ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ నివాళి
Rahul Priyanka Gandhi : ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు మాజీ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) భావోద్వేగానికి లోనయ్యారు. తన తండ్రి రాజీవ్ గాంధీని తలుచుకుని కుమిలి పోయారు. మే 21న మాజీ ప్రధాన మంత్రి దివంగత రాజీవ్ గాంధీ వర్దంతి. తమిళనాడులోని పెరంబదూర్ లో మానవ బాంబు ప్రయోగంతో తునాతునకలయ్యారు. నామ రూపాలు లేకుండా చెల్లా చెదురుగా మారి పోయారు. రాజీవ్ గాంధీ 32వ వర్ధంతి ఇవాళ.
ఆదివారం తన సోదరి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) వాద్రాతో కలిసి వర్దంతి సందర్బంగా ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సమాధి వద్దకు చేరుకున్నారు. ఘనంగా నివాళులు అర్పించారు. కన్నీటి పర్యంతం అయ్యారు రాహుల్ గాంఈ. రాజీవ్ గాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేశారు. ఇదిలా ఉండగా 1984లో తన తల్లి ఇందిరా గాంధీని దారుణంగా హత్య చేసిన తర్వాత రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టారు.
ఆ తర్వాత ప్రధానిగా కొలువు తీరారు. ఈ దేశంలో టెలికాం వ్యవస్థకు, టెక్నాలజీకి పునాదులు వేశారు. 1984లో తన తల్లి హత్య తర్వాత రాజీవ్ గాంధీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టారు. పాపా మీరు నాతో ఎల్లప్పటికీ ఉంటారని పేర్కొన్నారు. స్పూర్తిగా జ్ఞాపకాలలో ఎల్లప్పుడూ నిలిచే ఉంటారని పేర్కొన్నారు రాహుల్ గాంధీ.
అంతకు ముందు ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీ సైతం తన భర్త రాజీవ్ గాంధీకి సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు.
Also Read : Sonia Gandhi