Rahul Priyanka Viral : అన్నా చెల్లెలు హల్ చల్
రాహుల్ ..ప్రియాంక గాంధీ వైరల్
Rahul Priyanka Viral : తెలంగాణ – రాష్ట్రంలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిక్యంలోకి వచ్చింది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 60 సీట్ల మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. ఊహించని రీతిలో 119 సీట్లకు గాను 70కి పైగా ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి పార్టీ కేవలం 30కి పైగా సీట్లలో లీడ్ కొనసాగుతోంది. భారతీయ జనతా పార్టీ 8 సీట్లలో , ఎంఐఎం 4 సీట్లలో ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ బలపర్చిన సీపీఐ లీడ్ లో కొనసాగుతున్నారు.
Rahul Priyanka Viral on Elections
ఈ మొత్తం సీన్ లో ప్రధానంగా చెప్పు కోవాల్సింది కాంగ్రెస్(Congress) పార్టీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ , ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తో పాటు సీనియర్లు పెద్ద ఎత్తున సుడిగాలి పర్యటనలు చేశారు. సభలు, రోడ్ షోలతో హోరెత్తించారు.
భారీ ఎత్తున జనం ఆదరించారు. ఈ గెలుపులో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అధికారంలోకి తీసుకు వచ్చేలా చేసిందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అన్నా చెల్లెలు రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ కీలక వ్యాఖ్యలు చేసింది.
Also Read : Vivek Brothers Lead : వివేక్ బ్రదర్స్ జోష్