Rahul Varun Gandhi : సోద‌రుడు వ‌స్తే స్వాగ‌తం – రాహుల్

వ‌రుణ్ గాంధీపై కీల‌క వ్యాఖ్య‌లు

Rahul Varun Gandhi : దేశ రాజ‌కీయాల‌లో హాట్ టాపిక్ గా మారింది అన్న‌ద‌మ్ములైన రాహుల్ గాంధీ, వ‌రుణ్ గాంధీ వ్య‌వ‌హారం. ఇద్ద‌రూ ఒకే కుటుంబానికి చెందిన వారు. కానీ రాజ‌కీయం కుటుంబాన్ని వేరు చేసింది. అన్న‌ద‌మ్ములు రాజీవ్ గాంధీ, సంజ‌య్ గాంధీ త‌న‌యులు రాజీవ్ గాంధీ, వ‌రుణ్ గాంధీ మ‌ధ్య భావ‌జాలం వేరు.

వ‌రుణ్ గాంధీ కాషాయ భావ‌జాలాన్ని ఆచ‌రిస్తుంటే దానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తూ మాన‌వ‌త్వ‌మే త‌న మ‌త‌మ‌ని ప్ర‌క‌టిస్తూ వ‌స్తున్నారు రాహుల్ గాంధీ. బీజేపీ నుంచి ఎంపీగా వ‌రుణ్ గాంధీ గెలుపొందారు. కేంద్ర మంత్రిగా కూడా ప‌ని చేశారు. కానీ ఉన్న‌ట్టుండి ఆయ‌న కాషాయం కంట్లో న‌లుసుగా మారారు.

ప‌దే ప‌దే న‌రేంద్ర మోదీని, కేంద్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను తూర్పార ప‌డుతున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చిన సాగు చ‌ట్టాల‌ను వ్య‌తిరేకించారు వ‌రుణ్ గాంధీ. ఆయ‌న ప‌దే ప‌దే రైతుల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌, అగ్నీ వీర్ స్కీం, నిరుద్యోగం, ద్ర‌వ్యోల్బ‌ణం గురించి ప్ర‌స్తావిస్తూ వ‌స్తున్నారు.

కేంద్ర నిర్ణ‌యాలు పూర్తిగా ప్ర‌జ‌ల‌కు వ్య‌తిరేకంగా ఉన్నాయ‌ని ఆరోపించారు. ఈ త‌రుణంలో పొమ్మ‌న‌కుండా పొగ పెట్టే ప్ర‌య‌త్నంలో బీజేపీ ఉంది. ఈ త‌రుణంలో వ‌రుణ్ గాంధీ కాంగ్రెస్ పార్టీలోకి వెళుతున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో సోద‌రుడిపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు రాహుల్ గాంధీ(Rahul Varun Gandhi) .

సోద‌రుడి భావ‌జాలం త‌న ఆలోచ‌న‌లు వేర‌ని కానీ వ‌స్తే తాను స్వాగ‌తం ప‌లికేందుకు సిద్దంగా ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు. తాజాగా రాహుల్ చేసిన కామెంట్స్ ఆస‌క్తిక‌రంగా మారింది.

Also Read : ఆర్థిక వ్య‌వ‌స్థపై రాజ‌న్ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!