Amit Shah : విదేశీ టీ ష‌ర్ట్ తో రాహుల్ పాద‌యాత్ర

నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి అమిత్ షా

Amit Shah :  కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా(Amit Shah)  షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న రాహుల్ గాంధీపై నిప్పులు చెరిగారు. ఆయ‌న విదేశీ టీ ష‌ర్ట్ ధ‌రించి భార‌త దేశాన్ని ఏకం చేసేందుకు పాద‌యాత్ర చేప‌ట్టారంటూ ఎద్దేవా చేశారు.

కానీ తాము దేశీయంగా త‌యారు చేసిన వాటినే ధ‌రిస్తున్నామ‌ని చెప్పారు. శ‌నివారం రాజ‌స్థాన్ లోని జోధ్ పూర్ లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పాల్గొని ప్ర‌సంగించారు అమిత్ షా.

134 ఏళ్ల చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దేశంలో కేవ‌లం రెండు రాష్ట్రాల‌లో మాత్ర‌మే ప‌వ‌ర్ లో ఉంద‌న్నారు. అది త‌న ల‌క్ష్యాన్ని, సిద్దాంతాల‌ను గాలికి వ‌దిలి వేసింద‌న్నారు.

ప్ర‌స్తుతం భార‌త్ లో భార‌తీయ జ‌న‌తా పార్టీని ఢీకొనే స‌త్తా ఏ ఒక్క పార్టీకి, నాయ‌కుడికి లేదని స్ప‌ష్టం చేశారు అమిత్ షా. 2024లో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అడ్ర‌స్ లేకుండా పోతుంద‌న్నారు.

ఇక రాజ‌స్థాన్, ఛ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్రాల‌లో బీజేపీ జెండా ఎగుర వేస్తే ఇక కాంగ్రెస్ క‌నుమ‌రుగై పోతుంద‌ని, దానికి చెప్పుకునేందుకు చరిత్ర అంటూ ఉండ‌దంటూ ఎద్దేవా చేశారు.

ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) ధ‌రించిన టీ ష‌ర్ట్ ను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించ‌డం క‌ల‌క‌లం రేపింది. కాగా బీజేపీ ఆ టీ ష‌ర్ట్ ధ‌ర రూ. 41,000 అంటూ మండిప‌డింది.

అంత ధ‌ర పెట్టి ధ‌రించిన నాయ‌కుడికి ప్ర‌జా స‌మ‌స్య‌ల గురించి మాట్లాడే నైతిక హ‌క్కు లేద‌ని పేర్కొంది బీజేపీ. భార‌త మాతకు వంద‌నం. రాహుల్ బాబా భార‌త దేశాన్ని ఏకం ఎలా చేస్తారంటూ ప్ర‌శ్నించారు అమిత్ షా.

Also Read : స‌త్య‌పాల్ మాలిక్ కామెంట్స్ క‌ల‌క‌లం

Leave A Reply

Your Email Id will not be published!