PM Modi : ప‌వ‌ర్ కోసం రాహుల్ పాద‌యాత్ర – మోదీ

కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగిన ప్ర‌ధాని

PM Modi : దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ(PM Modi)  సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న నేరుగా రాహుల్ గాంధీపై విమ‌ర్శ‌లు ఎక్కు పెట్టారు. ప్ర‌జ‌ల కోసం , దేశం కోసం కానే కాద‌ని కేవ‌ల దేశంలో అధికారంలోకి రావాల‌నే ఉద్దేశంతోనే భార‌త్ జోడో యాత్ర చేప‌ట్టార‌ని ధ్వ‌జ‌మెత్తారు.

గుజ‌రాత్ రాష్ట్రంలో ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా సోమ‌వారం న‌రేంద్ర మోదీ ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్బంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అభివృద్ది నిరోధ‌కుల‌తో క‌లిసి రాహుల్ గాంధీ పాద‌యాత్ర చేప‌ట్టారంటూ ఆరోపించారు. సేవ కోసం మాత్రం కాద‌ని కేవలం ప‌వ‌ర్ కోసం మాత్ర‌మే న‌డుస్తున్నారంటూ మోదీ ఎద్దేవా చేశారు.

గుజ‌రాత్ లోని సౌరాష్ట్ర ప్రాంతం లోని సురేంద్ర న‌గ‌ర్ లో భారీ ర్యాలీ చేప‌ట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్లుగా దేశానికి ఏం చేసింద‌ని ప్ర‌శ్నించారు. వ‌చ్చే నెల డిసెంబ‌ర్ లో గుజ‌రాత్ లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ త‌రుణంలో కాంగ్రెస్ పై త‌న దాడికి ప‌దును పెట్టారు.

త‌మ భార‌త్ యాత్ర పాద‌యాత్ర కానే కాద‌న్నారు. ఇన్నేళ్ల పాటు యాత్ర చేప‌ట్ట‌ని రాహుల్ గాంధీ ఇప్పుడే ఎందుకు చేస్తున్నారంటూ ప్ర‌శ్నించారు. భార‌త దేశంలో ఇప్ప‌టికే కొన్నేళ్ల పాటు అభివృద్దికి దూరంగా ఉంద‌న్నారు.

క‌న్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా గ‌తంలో పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏం ఒర‌గ బెట్టిందంటూ మండిప‌డ్డారు న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ.

న‌ర్మ‌దా ప‌థ‌కాన్ని వ్య‌తిరేకించిన వారితో ఎలా న‌డుస్తారంటూ రాహుల్ గాంధీని ప్ర‌శ్నించారు న‌రేంద్ర మోదీ.

Also Read : లిక్కర్ స్కాంలో ముదుర్లు బెయిల్ వ‌ద్దు

Leave A Reply

Your Email Id will not be published!