Adhir Ranjan Chowdhury : యాత్ర ఢిల్లీకి చేరడం ఖాయం
ఎంపీ అధీర్ రంజన్ చౌదరి కామెంట్స్
Adhir Ranjan Chowdhury : కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కరోనా రూల్స్ పాటించక పోతే యాత్రను నిలిపి వేయాలని కోరుతూ రాహుల్ గాంధీకి లేఖ రాయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ అధీర్ రంజన్ చౌదరి(Adhir Ranjan Chowdhury). ఒక రకంగా యాత్రకు వస్తున్న ఆదరణను చూసి కేంద్రంలోని బీజేపీ తట్టుకోలేక పోతోందని పేర్కొన్నారు.
అన్ని వర్గాలకు చెందిన వారంతా రాహుల్ గాంధీ చేపట్టిన యాత్రలో స్వచ్చంధంగా పాల్గొంటున్నారని స్పష్టం చేశారు. ఈ సమయంలో లేఖ రాసిన కేంద్ర మంత్రికి కనీసం అవగాహన లేనట్టుందని ఎద్దేవా చేశారు. తమ పార్టీకి చెందిన నాయకులు, మంత్రులు ర్యాలీలు, ప్రదర్శనలు , బహిరంగ సభలు నిర్వహిస్తూ వుంటే ఎందుకు అడ్డు చెప్పడం లేదంటూ ప్రశ్నించారు.
ఇవాళ కర్నాటకలో బీజేపీ ఎమ్మెల్యే పాటిల్ ఆధ్వర్యంలో లింగాయత్ లు లక్ష మందికి పైగా తమకు రిజర్వేషన్లు కావాలని కోరుతూ భారీ ప్రదర్శన చేశారని మరి కరోనా రూల్స్ పాటించారా అని నిలదీశారు అధీర్ రంజన్ చౌదరి(Adhir Ranjan Chowdhury). ఇది పూర్తిగా కక్ష సాధింపు తప్ప మరొకటి కాదన్నారు.
రాహుల్ గాంధీ చేపట్టిన యాత్ర ఇప్పటికే 100 రోజులు పూర్తి చేసుకుందని మరో 50 రోజులకు పైగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు ఎంపీ. బరా బర్ రాహుల్ గాంధీ చేపట్టిన యాత్ర ఢిల్లీకి చేరుకుంటుందని కావాలంటే అడ్డుకోవాలని సవాల్ విసిరారు అధీర్ రంజన్ చౌదరి.
Also Read : సరిహద్దు వివాదం రాజ్యసభలో రాద్దాంతం