Raj Nath Singh : మణిపూర్ ఘటన బాధాకరం
కేంద్ర రక్షణ శాఖ మంత్రి
Raj Nath Singh : కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ లో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున పట్టు పట్టాయి. మణిపూర్ లో చోటు చేసుకున్న ఘటన గురించి. ఓ వర్గానికి చెందిన వారు ఇద్దరు దళిత మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో బయటకు వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై పెద్త ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఈ దేశంలో మోదీ ప్రధానమంత్రిగా కొలువు తీరాక బహుజన వర్గాలకు చెందిన వారే టార్గెట్ అవుతున్నారంటూ ఆరోపించాయి ప్రతిపక్షాలు.
Raj Nath Singh Words
గతంలో బిల్కిస్ బానో సామూహిక మానభంగం కేసులో దోషులను విడుదల చేసిన ఘనత గుజరాత్ ప్రభుత్వానికే దక్కుతుందని మండిపడ్డాయి. ఈ తరుణంలో దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ నిలదీశాయి.
దీనిపై శుక్రవారం పార్లమెంట్ లో స్పందించారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్(Raj Nath Singh). మణిపూర్ లో జరిగిన ఘటన చాలా తీవ్రమైనదని పేర్కొన్నారు. దోషులు ఎంతటి వారైనా సరే చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి ఆదేశించారని చెప్పారు. తాము కూడా బాధ పడుతున్నామని అన్నారు.
Also Read : AP High Court : ఏపీ హైకోర్టు తరలింపుపై కామెంట్స్