Raj Thackeray : మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్ ) చీఫ్ రాజ్ థాకరే ఇచ్చిన గడువు ( డెడ్ లైన్ ) ముగిసింది. బుధవారం జరిగే పరిణామాలకు తాము ఎలాంటి బాధ్యత వహించ బోమంటూ ఇప్పటికే రాజ్ థాకరే(Raj Thackeray) వార్నింగ్ ఇచ్చారు.
దాంతో ప్రజలను రెచ్చ గొట్టేలా ప్రసంగించారంటూ ఔరంగాబాద్ పోలీసులు రాజ్ పై పోలీసు కేసు నమోదైంది. మసీదుల వద్ద ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్ల ను బంద్ చేయాలంటూ ఇప్పటికే డిమాండ్ చేశారు.
ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వం చేయలేక పోతే తామే ఆ లౌడ్ స్పీకర్లలో హనుమాన్ చాలీసా పఠించేలా చేస్తామని ప్రకటించారు రాజ్ థాకరే(Raj Thackeray). దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన సర్వత్రా నెలకొంది ముంబైలో.
రాష్ట్ర హోం శాఖ మంత్రి, పోలీస్ బాస్ సమీక్ష చేపట్టారు. సీఎం ఉద్దవ్ ఠాక్రే ఇదంతా రాజకీయ డ్రామాగా కొట్టి పారేశారు. జెండాలు మార్చే వారు చేసే పిచ్చి ప్రేలాపనలు అంటూ మండిపడ్డారు.
రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని కానీ కొన్ని శక్తులు అడ్డుకునేందుకు యత్నిస్తున్నాయంటూ బీజేపీ, ఎంఎన్ఎస్ పై పరోక్షంగా ఫైర్ అయ్యారు సీఎం.
ఉదయం ముంబై లోని, సమీపంలోని అనేక మసీదులు ఆజా సమయంలో లౌడ్ స్పీకర్లు నిలిపి వేశాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రార్థనల సమయంలో లౌడ్ స్పీకర్లను నిలిపి వేస్తామని చెప్పిన మసీదు ట్రస్టీల పెద్దలతో పోలీసులు మీటింగ్ చేపట్టారు.
ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
Also Read : కన్నడ నాట బొమ్మైకి ఢోకా లేదు