Raj Thackeray : హనుమాన్ చాలీసా పారాయణం ఒక్క రోజుతో జరగదని అది నిరంతరం కొనసాగుతుందని హెచ్చరించారు ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే(Raj Thackeray ). ఆయన ప్రభుత్వానికి సవాల్ విసిరారు.
మసీదుల్లో ఆజా బంద్ చేయాలని ఒక వేళ లౌడ్ స్పీకర్ల ద్వారా పెట్టాలని ప్రయత్నం చేస్తే తాము హనుమాన్ చాలీసా పారాయణం వినిపిస్తామని డెడ్ లైన్ విధించారు. దీంతో రాజ్ థాకరేపై (Raj Thackeray )ఔరంగాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
మౌల్వీలు తమ మతానికి సంబంధించి బెట్టు వీడని వైఖరిని అవలంభిస్తే తాము కఠినమైన వైఖరిని ప్రదర్శించాల్సి వస్తుందని హెచ్చరించారు రాజ్ థాకరే.
ఈ నిరసన కార్యక్రమం ఒక్క రోజుతో ఆగి పోయేది కాదని అది నిరంతరం కొనసాగుతుంటుందని స్పష్టం చేశారు. లౌడ్ స్పీకర్లపై సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం ప్రభుత్వం పరిస్థితిని పరిష్కరించేంత వరకు ఇది కొనసాగుతుందని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ థాకరే అన్నారు.
బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది మత పరమైన సమస్య కానే కాదన్నారు. ఇది సామాజిక సమస్యగా రాజ్ థాకరే పేర్కొన్నారు. దీనిని మొదట అర్థం చేసుకోవాల్సింది ప్రభుత్వమే.
పదే పదే విన్నవించినా పట్టించు కోనప్పుడు మాత్రమే నిరసనలు, ఆందోళనలు కొనసాగుతాయని చెప్పారు. నిరసన మాత్రమే అసలైన సమస్యకు పరిష్కార మార్గమని అన్నారు రాజ్ థాకరే.
ముంబైలో 1,140కి పైగా మసీదులు ఉన్నాయి. వీటిలో 135 మసీదులు మార్గ దర్శకాలను ఉల్లంఘిస్తూ ఉదయం 5 గంటలకు ఆజా పెట్టాయి. ఈ మసీదులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో పోలీసులు చెప్పాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు రాజ్ థాకరే.
Also Read : తల్లి ఆశీర్వాదం యోగి ఆనందం