Raj Thackeray : రాజ్ ఠాక్రే జోలికి వస్తే అగ్నిగుండమే
లేఖపై హెచ్చరించిన ఎంఎన్ఎస్
Raj Thackeray : మరాఠాలో మాటల యుద్దం మళ్లీ మొదలైంది. నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగుతోంది. ఇప్పటికే సీఎం ఉద్దవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవ నిర్మాణ్‌ణన సేన (ఎంఎన్ఎస్) చీఫ్ కు మధ్య డైలాగ్ వార్ కొనసాగింది.
ప్రార్థనా మందిరాల్లో లౌడ్ స్పీకర్లు బంద్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈనెల 3న వరకు చాన్స్ ఇస్తున్నామని 4 నుంచి ఇక యుద్దమే మొదలవుతుందని ప్రకటించారు.
ఈ తరుణంలో మరాఠా పోలీసులు భారీగా మోహరించారు. ఇదే సమయంలో ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రేకు(Raj Thackeray) బెదిరింపు లేఖ రావడంతో కలకలం రేగింది. దీంతో తమ నేతకు ఏమైనా జరిగితే మరాఠా అగ్నిగుండమే అవుతుందని ఎంఎన్ఎస్ హెచ్చరించింది.
విచిత్రం ఏమిటంటే ఆయనకు ఉర్దూలో లేఖ రావడం మరింత అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. రాజ్ ఠాక్రే ప్రాణానికి ముప్పు ఉందని , ఆ లేఖ ఎవరు పంపించారో ప్రభుత్వమే చెప్పాలని డిమాండ్ చేశారు ఎంఎన్ఎస్ నేతలు.
మహారాష్ట్ర హోం శాఖ మంత్రి వల్సె పాటిల్ ను కలిసి ఈ బెదిరింపు లేఖ విషయం తెలిపారు. ఎంఎన్ఎస్ చీఫ్ కు ఏమైనా జరిగినా అది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని హెచ్చిరంచారు.
ఇదిలా ఉండగా లౌడ్ స్పీకర్ల విషయమై రాజ్ ఠాక్రే(Raj Thackeray) హెచ్చరించారు. ఈ తరుణంలోనే లేఖ రావడం మరింత వివాదానికి దారి తీసింది. కాగా భారీ ఎత్తున మరాఠా అంతటా ఎంఎన్ఎస్ కార్యకర్తలు, నాయకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
28 వేల మందికి ముందస్తు నోటీసులు కూడా ఇచ్చారు. పెద్ద సంఖ్యలో తమ కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
Also Read : మోదీ నిర్వాకం దేశానికి ప్రమాదం