K Annamalai : రాజా కామెంట్స్ అన్నామలై సీరియస్
తమిళనాడు ప్రత్యేక డిమాండ్ దేశ ద్రోహం
K Annamalai : కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే ఎంపీ ఎ. రాజా చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. తమిళనాడులో సెగలు పుట్టిస్తున్నాయి. తాజాగా ఎ. రాజా మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కావాలని డిమాండ్ చేశారు.
దీనిపై తమిళనాడు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ చీఫ్ కె. అన్నామలై(K Annamalai) తీవ్రంగా తప్పు పట్టారు. ఒక రకంగా ఎ . రాజా చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అప్రజాస్వామికమని ఆరోపించారు. బుధవారం కె. అన్నామలై మాట్లాడారు.
ఎ. రాజాపై, డీఎంకే సర్కార్ పై నిప్ఉలు చెరిగారు. దేని కోసమని ప్రత్యేక తమిళనాడు డిమాండ్ చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక రకంగా భారత రాజ్యాంగాన్ని మీరు అగౌరవ పరుస్తున్నారని మండిపడ్డారు.
తమిళనాడు రాష్ట్రం భారత దేశంలో అంతర్భాగం. దానిని వేరేగా ఉంచాలని అనుకోవడం దారుణమన్నారు అన్నామలై.
1960లో ద్రావిడ ఉద్యమ పితామహుడు పెరియార్ చేసిన రాష్ట్ర డిమాండ్ ను తిరిగి తెర పైకి తీసుకు రావడం రాజకీయం తప్ప మరొకటి కాదన్నారు.
ఇది పూర్తిగా రాజా మాట్లాడింది దేశ ద్రోహ పూరితమైదని పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం ఆయన మాట్లాడింది ముమ్మాటికీ నేరమేనని స్పష్టం చేశారు అన్నామలై.
ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాలను ఒకేలా చూడాలని చెప్పారన్నారు. ఐక్యత కావాలంటే హిందీ నేర్చుకోవాలని సూచించారని తెలిపారు కె. అన్నామలై(K Annamalai).
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాజా మాట్లాడుతున్నా ఎందుకు ఆప లేక పోయారని బీజేపీ చీఫ్ ప్రశ్నించారు.
Also Read : ఏసీబీపై సీరియస్ జడ్జికి వార్నింగ్