Raja Singh : మళ్లీ గెలుస్తా నేనేంటో చూపిస్తా
గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజా సింగ్
Raja Singh : హైదరాబాద్ – వివాదాస్పద నాయకుడిగా గుర్తింపు పొందారు భారతీయ జనతా పార్టీకి చెందిన గోషా మహల్ ఎమ్మెల్యే టి. రాజా సింగ్. ఆయనపై విధించిన సస్పెన్షన్ వేటును తొలగించింది బీజేపీ. ఈ మేరకు పార్టీ హైకమాండ్ నిర్ణయం వెల్లడించింది. పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సు మేరకు తనపై చర్యలు తీసుకోకుండా వెసులుబాటు ఇచ్చినట్లు పేర్కొంది.
Raja Singh Challenge
ఇదిలా ఉండగా తాజాగా తనపై వేటు తొలగించడంతో స్పందించారు ఎమ్మెల్యే టి. రాజా సింగ్(Raja Singh). తనను గోషా మహల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు పార్టీకి, ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియ చేస్తున్నానని అన్నారు.
ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా తాను గెలవడం ఖాయమని జోష్యం చెప్పారు. మళ్లీ గెలుస్తానని, బంపర్ మెజారిటీ సాధిస్తానని, తానేంటో చూపిస్తానంటూ శపథం చేశారు. టి. రాజా సింగ్. గోషా మహల్ ప్రజలకు తాను రుణపడి ఉంటానని స్పష్టం చేశారు.
తనను కొన్నేళ్లుగా ఆదరిస్తూ, ప్రేమిస్తూ వస్తున్నారని, పార్టీ సైతం తన పట్ల బ్యాన్ ను ఎత్తివేయడం తన పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు టి. రాజా సింగ్.
ఇదిలా ఉండగా తొలి జాబితాలో బీజేపీ 52 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఇప్పటికే బీఆర్ఎస్ 115 సీట్లను ఖరారు చేసింది. సీఎం కేసీఆర్ బి ఫారమ్ లు కూడా అందజేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ 55 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది.
Also Read : Komati Reddy Raja Gopal Reddy : హస్తం వైపు ‘కోమటిరెడ్డి’ చూపు