Rajanikanth Baba : ‘త‌లైవా’ అభిమానుల‌కు ఖుష్ క‌బ‌ర్

డిసెంబ‌ర్ 12న మ‌ళ్లీ రానున్న బాబా

Rajanikanth Baba : ర‌జ‌నీకాంత్ ఈ పేరు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అంత‌క‌న్నా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. కోట్లాది మంది అభిమానుల‌ను క‌లిగి ఉన్న ఈ అగ్ర న‌టుడు ఏది చేసినా, ఏది మాట్లాడినా అది సంచ‌ల‌న‌మే. భార‌తీయ సినీ రంగంలో మోస్ట్ పాపుల‌ర్ యాక్ట‌ర్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్.

ఫ్యాన్స్ ఆయ‌న‌ను ముద్దుగా త‌లైవా అని పిలుచుకుంటారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం డిజిట‌ల్ యుగం రావ‌డంతో స‌రికొత్త ట్రెండ్ కు తెర తీశారు. ప్ర‌ముఖ న‌టులు న‌టించిన పాత సినిమాల‌కు రంగులు అద్ది, డిజిట‌ల్ సొబగులు చేర్చి తిరిగి విడుద‌ల చేస్తున్నారు.

ఇందులో భాగంగా ర‌జ‌నీకాంత్ గ‌తంలో న‌టించిన బాబా సినిమాను(Rajanikanth Baba) డిసెంబ‌ర్ 12న రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా 20 ఏళ్ల కింద‌ట ర‌జ‌నీకాంత్, ల‌వ్లీ బ్యూటీ మ‌నీషా కోయిరాలా క‌లిసి న‌టించారు బాబా చిత్రంలో.

ఆ మూవీ ఆశించిన స్థాయిలో స‌క్సెస్ కాలేదు. కానీ ర‌జ‌నీకాంత్ ఇందులో ప్ర‌ద‌ర్శించిన స్టైల్ , డైలాగులు , పాట‌లు దుమ్ము రేపాయి. ఆ మ‌ధ్య‌న ఆయ‌న హిమాల‌యాల్లోకి వెళ్ల‌డం, ధ్యానం చేయ‌డం అదే స‌మ‌యంలో బాబాగా తీశాడు ద‌ర్శ‌కుడు ర‌జ‌నీకాంత్ ను పెట్టి. కానీ అనుకున్నంత‌గా ఆక‌ట్టుకోలేక పోయింది.

కానీ మంచి టాక్ తెచ్చుకుంది బాబా చిత్రం. ఇందులో ర‌జ‌నీ కాంత్ స్టైల్ అండ్ స్వాగ్ , బాబా కౌంట్ స్టార్ట్ అంటూ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ చెప్పిన డైలాగులు పేలాయి. జ‌నాన్ని పెద్ద ఎత్తున ఆక‌ట్టుకున్నాయి. డిసెంబ‌ర్ 12న త‌లైవా పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా స‌రికొత్త‌గా బాబాను విడుద‌ల చేయ‌నున్నారు. దీంతో త‌లైవా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.

Also Read : మోగాస్టార్ కు అవార్డు మోదీ కితాబు

Leave A Reply

Your Email Id will not be published!