Rajeev Chandrasekhar : ఐఫోన్ 14 ప్రో అమ్మ‌కాల‌పై మంత్రి ఆరా

ఆపిల్ కంపెనీతో రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్

Rajeev Chandrasekhar : ప్ర‌పంచంలో ఐఫోన్ కు ఉన్నంత క్రేజ్ ఇంకే ఫోన్ కు లేదంటే న‌మ్మ‌లేం. ఏ ఒక్క‌టి రిలీజ్ చేసినా దానికి విప‌రీత‌మైన డిమాండ్ ఉంటోంది. తాజాగా ఆపిల్ సంస్థ నుండి విడుద‌ల చేసిన ఐఫోన్ 14 ప్రో ఏకంగా భార‌త మార్కెట్ లో విడుద‌లైన కొద్ది సేప‌ట్లోనే అమ్ముడు పోయాయి.

దీంతో పెద్ద ఎత్తున ఆపిల్ అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళ‌న చెందారు. గ‌తంలో విడుద‌ల చేసిన ఐఫోన్ 11, 12, 13 కంటే ఈసారి తాజాగా రిలీజ్ చేసిన ఐఫోన్ 14 కు య‌మ క్రేజ్ పెర‌గ‌డం విశేషం. దీంతో చివ‌ర‌కు ప‌రిస్థితిని గ‌మ‌నించిన కేంద్ర మంత్రి ఏకంగా రంగంలోకి దిగారు.

ఎందుకు స్టాక్ లేదోన‌ని ఆరా తీశారు. ఐఫోన్ 14 ప్రోకు అనూహ్యంగా డిమాండ్ పెరిగిందని, ఆపిల్ ఆశించిన దానికంటే ఎక్కువ‌గా డిమాండ్ ఉండ‌డంతో ఉన్న కొద్ది సేప‌ట్లోనే స్టాక్ పూర్తిగా అయి పోయింద‌ని సంస్థ తెలిపింద‌ని మంత్రి చంద్ర‌శేఖ‌ర్(Rajeev Chandrasekhar)  సెల‌విచ్చారు. స‌ర‌ఫ‌రా ప‌రిమితుల‌ను ఆపిల్ ప‌రిస్క‌రిస్తుంద‌ని వెల్ల‌డించారు.

దేశ రాజ‌ధాని ఢిల్లీతో పాటు ఇత‌ర ప్ర‌ధాన న‌గ‌రాల‌లో ఆపిల్ ఐఫోన్ 14 ప్రో అయిపోయిన‌ట్లు నివేదిక‌లు అందాయ‌ని తెలిపారు. ఈ మేర‌కు తాను ఆపిల్ కంపెనీతో మాట్లాడే ప్ర‌య‌త్నం చేశాన‌ని చెప్పారు ఎల‌క్ట్రానిక్స్ , ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్.

త్వ‌ర‌లోనే మ‌రికొన్ని అందుబాటులోకి వ‌స్తాయ‌న్న ఆశాభావం వ్య‌క్తం చేశారు. అయితే ప్రైవేట్ అమ్మ‌కందారులు బ్లాక్ లో విక్ర‌యిస్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయ‌ని అందుకే తాను ఆరా తీశానని తెలిపారు.

Also Read : ఐసీసీ టాప్ 10లో విరాట్ సూర్య‌..కోహ్లీ

Leave A Reply

Your Email Id will not be published!