Rajinikanth : బాబుతో తలైవా భేటీ అబద్దం
ఖండించిన వ్యక్తిగత సిబ్బంది
Rajinikanth : అన్ని వైపుల నుంచి చంద్రబాబుకు వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఏపీ స్కిల్ స్కామ్ లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న బాబుకు విపక్షాల నుంచి సహకారం అందడం లేదు. ఇదే సమయంలో తమిళ సినీ సూపర్ స్టార్ రజనీకాంత్ ఫోన్ లో లోకేష్ బాబుతో మాట్లాడారని ప్రచారం జరిగింది.
Rajinikanth Met Chandrababu
ఇది పక్కన పెడితే నిన్నంతా సోషల్ మీడియా వేదికగా రజనీకాంత్ రాజమండ్రికి వస్తున్నారంటూ తెగ ఊదరగొట్టారు. చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడని, సమర్థుడని , ఏదో ఒక రోజు బయటకు వస్తాడని రజనీకాంత్(Rajinikanth ) అన్నట్లు పేర్కొన్నారు. శనివారం ప్రత్యేకించి బాబును కలిసేందుకు రాజమండ్రికి వస్తారంటూ తెలిపారు.
తాజాగా రజనీకాంత్ వ్యక్తిగత సిబ్బంది తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు నాయుడుతో తలైవా భేటీ కావడం లేదని, ఆ ప్రచారం అంతా అబద్దమని ఖండించింది. రజనీకాంత్ ప్రస్తుతం షూటింగ్ లో ఉన్నారని , రాజమండ్రికి వచ్చే షెడ్యూల్ ఏదీ లేదని అభిమానులు దీనిని గమనించాలని సూచించింది. ఈ విషయంపై టీడీపీ నేతలు స్పందించేందుకు ముందుకు రాలేదు.
మరో వైపు బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. 14 రోజుల రిమాండ్ విధించింది. సుప్రీంకోర్టు నుంచి లాయర్ వచ్చినా ఫలితం లేకుండా పోయింది. జడ్జి హిమ బిందు సదరు న్యాయవాదిపై సీరియస్ అయ్యారు.
కోర్టు పరిధిలో మాట్లాడాలని, తనను డిక్టేట్ చేసేందుకు ప్రయత్నం చేయొద్దంటూ స్పష్టం చేసింది. ఆమె హాట్ టాపిక్ గా మారారు.
Also Read : Siddarth Luthra : Comment లూథ్రా ఆయుధం పట్టమంటే ఎలా