Jailer Movie : తమిళ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ హీరో సూపర్ స్టార్ రజనీ కాంత్. ఆయనకు లెక్కించ లేనంత మంది అభిమానులు ఉన్నారు. మేకింగ్, టేకింగ్ లో సూపర్ అనిపించకున్న దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తలైవా ప్రధాన పాత్రలో జైలర్(Jailer Movie) వస్తోంది. ఈ సినిమాకు సంబంధించి రోజుకో అప్ డేట్ వస్తోంది. ఇప్పటికే మూవీ మేకర్స్ సినిమాకు సంబంధించి పోస్టర్స్ , ట్రైలర్ , సాంగ్ విడుదల చేసింది. భారీ ఎత్తున ఆదరణ లభిస్తోంది.
ఇందులో కీలకమైన పాత్రలో దిగ్గజ నటులు నటిస్తుండడం విశేషం. ఇక దర్శకుడు నెల్సన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బాలీవుడ్ కు చెందిన జాకీ ష్రాఫ్ , మలయాళ సినీ దిగ్గజ నటుడు మోహన్ లాల్ , కన్నడ కంఠీరవ తనయుడు శివ రాజ్ కుమార్ తో పాటు అందాల ముద్గుగుమ్మ తమన్నా భాటియా నటిస్తుండడంతో చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి.
ఇక దిగ్గజ నటులతో పాటు రమ్య కృష్ణన్ , వినాయకన్ , మిర్నా, వసంత్ రవి, నాగేంద్ర బాబు, యోగి బాబు, జాఫర్ సాదిక్ , కిషోర్ కుమార్ , బిల్లీ మురళి, సుగుంతన్ , కరాటే కార్తీ, మిథున్ , అర్షద్ , జి. మురి ముత్తు నటించారు. జైలర్ చిత్రానికి కథను అందించారు. జైలర్ చిత్రాన్ని కళా నిధి మారన్ నిర్మిస్తుండగా యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read : Tirumala Garuda Seva : తిరుమలలో ఘనంగా గరుడ సేవ
