Rajnath Singh Gifted : రాజ్ నాథ్ సింగ్ కు గుర్రం బ‌హుమానం

గిఫ్ట్ గా ఇచ్చిన మంగోలియ‌న్ ప్రెసిడెంట్

Rajnath Singh Gifted :  దేశ ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అరుదైన గిఫ్ట్ ను(Rajnath Singh Gifted) బ‌హుమానంగా అందుకున్నారు. మంగోలియ‌న్ అధ్య‌క్షుడు ఉఖ్ నాగిన్ ఖురేల్ సుఖ్ ఎప్ప‌టికీ గుర్తుగా ఉండేందుకు గాను గుర్రాన్ని గిఫ్ట్ గా ఇచ్చారు.

దేశ ప్రెసిడెంట్ తో రాజ్ నాథ్ సింగ్ భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా వ్యూహాత్మ‌క ద్వైపాక్షిక సంబంధాల‌ను స‌మీక్షించారు. ఇదిలా ఉండ‌గా గిఫ్ట్ గా ఇచ్చిన గుర్రానికి తేజ‌స్ అని పేరు పెట్టారు.

రాజ్ నాథ్ సింగ్ మంగోలియా ను సంద‌ర్శించడం ర‌క్ష‌ణ శాఖ మంత్రిగా ఇదే మొద‌టిసారి కావ‌డం విశేషం. అద్భుత‌మైన గుర్రాన్ని బ‌హుమ‌తిగా ఇవ్వ‌డంతో సంతోషానికి లోన‌య్యారు.

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి ఈ దేశ నాయ‌క‌త్వం నుండి గిఫ్ట్ ల‌భించ‌డం విశేషం. మంగోలియా నుంచి ప్ర‌త్యేక‌మైన బ‌హుమ‌తి అందుకున్నా.

ప్రేమ పూర్వ‌కంగా ఇచ్చిన ఈ బ‌హుమానం ఎల్ల‌ప్ప‌టికీ గుర్తు పెట్టుకునేదిగా ఉంటుంద‌ని తాను అనుకుంటున్న‌ట్లు తెలిపారు రాజ్ నాథ్ సింగ్. తెల్లటి ఛాయతో క‌లిగిన అశ్వం ,

దానికి సంబంధించిన ఫోటోల‌ను పంచుకున్నారు కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి. ఈ మేర‌కు త‌న అభిప్రాయాన్ని బుధవారం ట్విట్ట‌ర్ ద్వారా పంచుకున్నారు. 2018లో ప్ర‌స్తుత మంగోలియ‌న్ ప్రెసిడెంట్ అప్పుడు ప్ర‌ధాన మంత్రిగా ఉన్నారు.

ఆ దేశంతో భార‌త దేశం ప్ర‌త్యేక‌మైన సంబంధాలు క‌లిగి ఎల్ల‌ప్ప‌టికీ ఉంటుంద‌న్నారు రాజ్ నాథ్ సింగ్(Rajnath Singh). వ్యూహాత్మ‌క ర‌క్ష‌ణ సంబంధాల‌ను విస్త‌రించే ల‌క్ష్యంతో ర‌క్ష‌ణ మంత్రి గ‌త సోమ వారం నుండి మంగోలియా, జాప‌న్ల‌లో ఐదు రోజుల ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు.

Also Read : బ్రిట‌న్ లో ముగ్గురు మ‌హిళా ప్ర‌ధానులు

Leave A Reply

Your Email Id will not be published!