Rajnath Singh Rahul : రాహుల్ పై భ‌గ్గుమ‌న్న రాజ్ నాథ్

దేశాన్ని కించ ప‌రిస్తే ఊరుకోమ‌న్న కేంద్రం

Rajnath Singh Rahul : భార‌త దేశంలో ప్ర‌జాస్వామ్యం ప్ర‌మాదంలో ప‌డిందంటూ లండ‌న్ వేదిక‌గా కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ పై కేంద్ర స‌ర్కార్ నిప్పులు చెరిగింది. ఇది పూర్తిగా దేశాన్ని కింప ప‌ర్చ‌డం త‌ప్ప మ‌రొక‌టి కాద‌ని పేర్కొంది. మ‌రోసారి ఇలాంటి చ‌వ‌క‌బారు కామెంట్స్ చేస్తే తాము ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌ని హెచ్చ‌రించింది.

సోమ‌వారం పార్ల‌మెంట్ సమావేశాలు మొద‌ల‌య్యాయి. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య‌ల‌పై లోక్ స‌భ‌లో తీవ్ర దుమారం చెల‌రేగింది. ఒక ప్ర‌తిప‌క్ష నాయ‌కుడై ఉండి ఇలా మాట్లాడ‌తారా అంటూ మండిప‌డింది. కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రాహుల్ గాంధీపై(Rajnath Singh Rahul) నిప్పులు చెరిగారు. తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని అన్నారు. 

ఇంకోసారి ఇలాంటి చ‌వ‌క‌బారు విమ‌ర్శ‌లు చేస్తే ఊరుకోమ‌ని వార్నింగ్ ఇచ్చారు. గౌర‌వ ప్ర‌ద‌మైన ఎంపీగా ఉన్న రాహుల్ దేశం ప‌ట్ల ఉన్న గౌర‌వం ఇదేనా అని నిల‌దీశారు. స‌భా వేదిక‌గా దేశం ప‌ట్ల అనుచిత వ్యాఖ్య‌లు చేస్తూ ప‌రువుకు భంగం క‌లిగించేలా మాట్లాడిన రాహుల్ గాంధీ వెంట‌నే క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా మండిప‌డింది. దేశాన్ని లూటీ చేసి బ్యాంకుల‌కు టోక‌రా పెట్టిన అదానీ గ్రూప్ మోసం బ‌య‌ట ప‌డ‌కుండా ఉండేందుకే కేంద్ర స‌ర్కార్ రాహుల్ గాంధీని(Rahul Gandhi) టార్గెట్ చేసిందంటూ ఆరోపించింది. ముందు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి, గౌతం అదానీకి మ‌ధ్య ఉన్న బంధం ఏమిటో చెప్పాల‌ని డిమాండ్ చేసింది. దేశంలో డెమోక్ర‌సీకి ప్రమాదం ఏర్ప‌డింద‌ని మాత్ర‌మే అన్నార‌ని ఇందులో త‌ప్పేముంద‌ని ప్ర‌శ్నించింది. ఇది నిజం కాదా అని నిల‌దీసింది కాంగ్రెస్.

Also Read : ది ఎలిఫెంట్ విస్ప‌ర‌ర్స్ గ్రేట్

Leave A Reply

Your Email Id will not be published!