Uddhav Thackeray : ఠాక్రే కూట‌మికి కోలుకోలేని దెబ్బ

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ షాక్

Uddhav Thackeray : మ‌హారాష్ట్ర రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో శివ‌సేన చీఫ్ , సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే(Uddhav Thackeray) మ‌హా వికాస్ అఘాడీ సంకీర్ణ స‌ర్కార్ కు కోలుకోలేని దెబ్బ త‌గిలింది. ఊహించ‌ని రీతిలో భార‌తీయ జ‌న‌త పార్టీ 6వ ఎంపీ సీటును కైవ‌సం చేసుకుంది.

క్రాస్ ఓటింగ్ , బీజేపీ, అధికార కూట‌మి నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌పై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ ఆల‌స్యంగా జరిగింది. రాత్రి 8 గంట‌ల త‌ర్వాత మొద‌లైంది.

అధికార కూట‌మికి ఒక ర‌కంగా పెద్ద దెబ్బ‌గా భావించ‌క త‌ప్ప‌దు. మ‌హారాష్ట్ర‌లో శివ‌సేన‌పై వ‌రుస పోరులో బీజేపీ ఎలా సీటు ద‌క్కించు కుంద‌నే దానిపై చ‌ర్చ జ‌రుగుతోంది.

ఈ ఫ‌లితాలు రాష్ట్రంలో రాబోయే ఎమ్మెల్సీ , పౌర ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం చూపేందుకు ఎక్కువ‌గా ఆసార్కం ఉంది. భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ధ‌నంజ‌య్ మ‌హాదిక్ ఆరో స్థానంలో శివ సేన పార్టీకి చెందిన సంజ‌య్ ప‌వార్ పై ఘ‌న విజ‌యం సాధించారు.

శ‌నివారం తెల్లవారుజామున ఫ‌లితాలు ప్ర‌క‌టించారు. ఈ ఫ‌లితాల్లో బీజేపీకి అనూహ్యంగా 10 ఓట్లు వ‌చ్చాయి. ఒక అభ్య‌ర్థి విజ‌యానికి 41 ఓట్లు అవ‌స‌రం.

ఇక మిగ‌తా ఎంపీ సీట్ల‌లో బీజేపీకి చెందిన పీయూష్ గోయ‌ల్, అనిల్ బోండే, కాంగ్రెస్ నుండి ఇమ్రాన్ ప్ర‌తాప్ గ‌గ‌ర్హి, ఎన్సీపీ నుండి ప్ర‌పుల్ ప‌టేల్ , శివ సేన నుండి సంజ‌య్ రౌత్ ఉన్నారు.

ఇదిలా ఉండ‌గా పీయూష్ గోయల్ , అనిల్ బోండే ఇద్ద‌రికీ 48 ఓట్లు వ‌చ్చాయి. కాగా బీజేపీ ఎన్నిక‌ల రూల్స్ ను పాటించ లేదంటూ ఆరోపించారు శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్.

Also Read : బీజేపీ హ‌వా విప‌క్షాల‌కు షాక్

Leave A Reply

Your Email Id will not be published!