Rakesh Tikait : వ్యవసాయ రంగంపై కేంద్రం వివక్ష
రైతు అగ్ర నేత రాకేశ్ తికాయత్ ఫైర్
Rakesh Tikait : భారతీయ కిసాన్ యూనియన్ , కిసాన్ సంయుక్త మోర్చా అగ్ర నాయకుడు రాకేశ్ తికాయత్(Rakesh Tikait) కేంద్ర సర్కార్ పై నిప్పులు చెరిగారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. వ్యవసాయ రంగంపై పూర్తిగా వివక్షా పూరితంగా వ్యవహరిస్తోందంటూ ఆరోపించారు.
రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంలో ఇప్పటి వరకు ఇచ్చిన హామీని నెరవేర్చిన దాఖాలాలు లేవని పేర్కొన్నారు.
వ్యవసాయ రంగంలో భారీ ఆంక్షల కారణంగా శ్రీలంకలో తీవ్రమైన ఇబ్బంది ఏర్పడిందని, అదే సీన్ భారత దేశంలో కొనసాగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
దేశంలో 70 శాతానికి పైగా వ్యవసాయ రంగంపై ఆధారపడి బతుకుతున్న వారేనని పేర్కొన్నారు. చెరుకు రైతులకు షేర్ సర్టిఫికెట్లు ఇవ్వడం వల్ల రైతులకు ప్రయోజనం కలగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రాకేశ్ తికాయత్.
డిజిటల్ జపం చేయడం వల్ల దేశం పురోగతి సాధిస్తుందని అనుకుంటే పొరపాటు పడినట్లేనని హితవు పలికారు. అభివృద్ది చెందిన దేశాలలో సైతం వ్యవసాయాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారని గుర్తించాలని సూచించారు రాకేశ్ తికాయత్(Rakesh Tikait).
పెట్టుబడులు అందక, ధరా భారం మోయలేక రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని వాపోయారు. రైతుల ప్రయోజనాలకు పెద్దపీట వేయాల్సిన కేంద్రం గుప్పెడు మంది పెట్టుబడిదారులకు దాసోహం అంటోందని ఆరోపించారు.
వ్యవసాయ రంగంలో భారీ ఆంక్షల కారణంగా రసాయన, పురుగు మందుల పంటలను తక్కువగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ప్రకృతి వ్యవసాయాన్ని అభివృద్ది చేయాలని సూచించారు రాకేశ్ తికాయత్.
ప్రభుత్వం వ్యవసాయ విధానాన్ని మార్చి రైతులకు అవగాహన కల్పించి ఉత్పత్తిని పెంచే మార్గాలను అన్వేషించాలని కోరారు.
Also Read : కురుస్తున్న వర్షాలు తప్పని కష్టాలు