Rakesh Tikait : అజ‌య్ మిశ్రాను తొల‌గించే దాకా పోరాటం

రైతు అగ్ర నేత రాకేశ్ టికాయ‌త్ ప్ర‌క‌ట‌న

Rakesh Tikait : సంయుక్త కిసాన్ మోర్చా అగ్ర నేత రాకేశ్ టికాయ‌త్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న కేంద్ర స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు.

రైతులతో పాటు ఎనిమిది మంది చావుకు కార‌కుడైన ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను వెంట‌నే కేబినెట్ నుంచి తొల‌గించాల‌ని టికాయ‌త్ డిమాండ్ చేశారు.

గురువారం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వ‌ర్యంలో గురువారం 72 గంట‌ల నిర‌స‌న‌కు పిలుపునిచ్చింది. ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని ల‌ఖింపూర్ ఖేరి లో 10,000 వేల మందికి పైగా రైతులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.

కేంద్ర మంత్రిని తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళ‌న‌కు శ్రీ‌కారం చుట్టారు. ఈ నిరాహార‌దీక్ష‌ను ఉద్దేశించి రాకేశ్ టికాయ‌ట్(Rakesh Tikait)  ప్ర‌సంగించారు.

గ‌త ఏడాది అక్టోబ‌ర్ లో ల‌ఖింపూర్ ఖేరిలో ర‌ద్దు చేసిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న తెలిపిన రైతుల‌ను చంపిన‌ట్లు కేంద్ర మంత్రి కుమారుడిపై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

సిట్ శ‌నివారంతో ముగుస్తుంద‌ని, క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ల‌కు హామీ ఇచ్చే చ‌ట్టం, విద్యుత్ ప్రైవేటీక‌ర‌ణ‌కు స్వస్తి ప‌ల‌క‌డం, అజ‌య్ మిశ్రా టేనీ పై చ‌ర్య‌లు స‌హా పెండింగ్ లో ఉన్న డిమాండ్ ల కోసం రైతులు త‌మ వ్యూహాన్ని రూపొందిస్తార‌ని టికాయ‌త్ వెల్ల‌డించారు.

రైతు వ్య‌తిరేక విధానాల‌ను అమ‌లు చేయ‌డం మానుకోనంత వ‌ర‌కు రైతులు పోరాటం చేస్తూనే ఉంటార‌ని హెచ్చరించారు టికాయ‌త్. త‌మ వ్య‌వ‌సాయాన్ని కాపాడుకునేందుకు సిద్దంగా ఉండాల‌ని పిలుపునిచ్చారు.

ఈ ఆందోళ‌న పంజాబ్ కు చెందిన రైతు నాయ‌కుడు అవ‌తార్ సింగ్ మెహ్లూ సార‌థ్యంలో కొన‌సాగుతోంది.

Also Read : నిర్వాహ‌కుల క‌మిటీపై సుప్రీంకోర్టు నిషేధం

Leave A Reply

Your Email Id will not be published!