Rakesh Tikait : పెట్టుబ‌డిదారుల‌కు లాభం రైతుల‌కు మోసం

మోదీ స‌ర్కార్ పై నిప్పులు చెరిగిన తికాయ‌త్

Rakesh Tikait : భార‌తీయ కిసాన్ మోర్చా జాతీయ అధికార ప్ర‌తినిధి, కిసాన్ మోర్చా జాతీయ అగ్ర నేత రాకేశ్ తికాయ‌త్(Rakesh Tikait) నిప్పులు చెరిగారు. కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్ర‌భుత్వాన్ని క‌డిగి పారేశారు.

ఇది వ్యాపార‌వేత్త‌ల కోసం మాత్ర‌మే ప‌ని చేస్తోంద‌ని ప్ర‌జ‌ల కోసం కాద‌ని ఆరోపించారు. బుధ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా రాకేశ్ తికాయ‌త్ స్పందించారు. పూర్తిగా వ్య‌వ‌సాయ రంగాన్ని స‌ర్వ నాశ‌నం చేసేందుకు కంక‌ణం క‌ట్టుకున్నార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

ప్ర‌ధానంగా ఈ రంగంపై ఆధార‌ప‌డిన కోట్లాది కుటుంబాలు ఇవాళ రోడ్ల పైకి వ‌చ్చే ప‌రిస్థితి నెల‌కొంద‌న్నారు. ఈరోజు వ‌ర‌కు పండించిన పంట‌ల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించ‌డంలో చ‌ర్య‌లు తీసుకున్న పాపాన పోలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు రాకేశ్ తికాయ‌త్(Rakesh Tikait).

వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌ను పెట్టుబడిదారుల‌కు అప్ప‌గించి రైతుల‌ను, సామాన్య ప్ర‌జ‌ల‌ను మోదీ ప్ర‌భుత్వం మోసం చేసింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గోధుమ‌ల కొనుగోళ్ల‌లో సైతం వివ‌క్ష కొన‌సాగుతూనే ఉంద‌న్నారు.

ఇదే స‌మ‌యంలో ప్ర‌స్తుతం నాన్ బ్రాండెడ్ పిండి, బియ్యం , త‌దిత‌ర ఉత్ప‌త్తుల‌పై జీఎస్టీ విధించ‌డం దారుణ‌మ‌ని మండిప‌డ్డారు రాకేశ్ తికాయ‌త్. పేద‌లు, రైతులు, సామాన్యుల‌ను మోసం చేయ‌డం త‌ప్ప మ‌రొక‌టి కాద‌న్నారు.

ఈ దేశంలో అదానీలు, అంబానీలు, అమెజాన్ కు మేలు చేకూర్చేందుకే ప్ర‌భుత్వం ఉంది త‌ప్పా 130 కోట్ల ప్ర‌జ‌ల కోసం కాద‌ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు ఈ రైతు అగ్ర నేత‌.

రైతులు గ‌త్యంత‌రం లేక ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారు. పెట్టిన పెట్టుబ‌డి రావ‌డం లేద‌ని వాపోయారు. మ‌రోసారి ఉద్య‌మించాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్నారు తికాయ‌త్.

Also Read : ఉద్దేశ పూర్వ‌కంగానే ప్ర‌చారం – ఎన్ఐఏ

Leave A Reply

Your Email Id will not be published!